మరికల్, ఆగస్టు 11 : మహబూబ్‌నగర్-మునీరాబాద్ రైల్వే లైన్ పనులు స్లోగా సాగుతున్నాయి. ప్రజలకు సులభతర ప్రయాణానికి కేంద్ర ప్రభుత్వం 1997లో నూతనంగా లైన్ నిర్మించాలని తలపెట్టగా.. తెలంగాణలో పను లు పూర్తయినా కర్ణాటకలో 30 ఏండ్లుగా నత్తనడక సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మొదట రూ.380 కోట్ల అంచనాతో పను లు ప్రారంభించగా ప్రస్తుతం వ్యయం భారీగా పెరిగింది. దాదాపు రూ.3,543 కోట్ల అంచనాలతో నేడు పనులు జరుగుతున్నాయి.
మహబూబ్‌నగర్ నుంచి దేవరకద్ర, మరికల్, జక్లేర్, మక్తల్, మాగనూర్, కృష్ణ వరకు పనులు పూర్తికావడంతో నిత్యం పదుల సంఖ్యలో గూడ్స్ రై ళ్లు పరుగులు పెడుతున్నాయి.. కానీ ప్రజా ర వాణాకు ప్యాసింజర్ రైళ్లను మాత్రం అధికారులు నడపడం లేదు. ఈ రైల్వే లైన్‌తో హైదరాబాద్ నుంచి గోవాకు వెళ్లేందుకు 80 నుంచి 100 కిలోమీటర్ల దూరంతోపాటు 2 గంటల ప్రయాణం తగ్గుతుంది. రైల్వే అధికారులు నిర్ల క్ష్యం కారణంగా కర్ణాటకలో మన్వి నుంచి రా యిచూర్ వరకు పనులు నత్తనడకన నడుస్తున్నాయి. ఈ పనులు త్వరగా పూర్తయితే రైలు మరింత మరింత సౌకర్యంగా మారనున్నది.
ఏపీ, తెలంగాణ, కర్ణాటక ప్రాంత ప్రయాణికులను కనెక్టివిటీ చెసేందుకు గతేడాది మహబూబ్‌నగర్ వరకు వస్తున్న విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను రాయిచూర్ వరకు పొడిగించాలని రైల్వే అధికారులు ప్రతిపాదనలు చేశారు. గతంలో రాయిచూర్ రైల్వే స్టేషన్ గుంతకల్ డివిజన్లో ఉండడంతో ఈ ప్రతిపాదనకు అక్కడి అధికారులు పక్కకు పెట్టడంతో విశాఖ ఎక్స్‌ప్రెస్ ప్రతిపాదనలు నిలిచిపోయాయి.
ప్రస్త్తుతం జూలై ఒకటో తేదీ నుంచి రాయిచూర్ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి చేరింది. దీంతో విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను రాయిచూర్ వరకు పొడిగించాలని ఇక్కడి ప్రయాణికులు డిమాండ్ చేస్త్తున్నారు. రాయిచూర్, మక్తల్, మరికల్ నుంచి ఆంధ్రాకు వెళ్లే ప్రయాణికులు అధికంగా ఉండడంతో ఈ రైలును వెం టనే పొడిగించడంతోపాటు మరికల్, మక్తల్, కృష్ణ స్టేషన్లలో నిలిపేలా చూడాలని కోరుతున్నారు. ఇదే విషయమై గతంలో ఎంపీ డీకే అరుణకు మరికల్ ప్రాంత ప్రజలు వినతిపత్రం కూడా అందజేశారు.
మహబూబ్‌నగర్ నుంచి కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రస్తుతం ప్ర యాణికులు తాండూర్, రాయిచూర్, యాద్గిర్‌కు బస్సులో వెళ్ల్లే పరిస్థితి ఏర్పడింది. ని త్యం వందలాది మంది ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. రాయిచూర్ నుంచి సోలాపూర్‌కు వెళ్తున్న రాయిచూర్-విజాపూర్ ప్యాసింజర్‌ను మహబూబ్‌నగర్ వరకు పొడిగిస్తే ఈ ప్రాంత ప్రయాణికులకు సౌకర్యవంతగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
డెమో సమయాలు మార్చాలి కాచిగూడ నుంచి రాయిచూర్‌కు నిత్యం న డుస్త్తున్న డెమో రైలుతో ప్రభుత్వానికి నష్టం తప్పా ప్రజలకు లాభం లేదు. కాచిగూడలో ఉదయం 10 గంటలకు ప్రారంభమైయ్యే ఈ రైలు రాయిచూర్ నుంచి ఉదయం 5 గంటలకు ప్రారంభమైతే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది. నిత్యం రాయిచూర్ నుంచి వ్యాపారులు హైదరాబాద్‌కు వందలాదిగా వెళ్త్తుంటారు. ఈ డెమో రాయిచూర్ నుంచి సాయంత్రం హైదరాబాద్‌కు వెళ్తుండడంతో ప్రయాణికులకు ఇబ్బందు లు తప్పా ప్రయాణం సాగటం లేదు.
రైల్వే అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ప్ర యాణికులకు ఇబ్బందులు ఏర్పడుతున్నా యి. వచ్చే ఒకే డెమో కూడా సమయపాలన పాటించడం లేదు. ఉదయం రాయిచూర్ నుంచి ప్రయాణం ప్రారంభిస్తే వ్యా పారులతోపాటు ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రైల్వే అధికారు లు ఇప్పటికైనా స్పందించి డెమో సమయాన్ని మార్చడంతోపాటు, విశాఖ ఎక్స్‌ప్రెస్, రాయిచూర్- విజాపూర్ ప్యాసింజర్‌ను పొడిగించాలని మరికల్, మక్తల్, మాగనూర్, కృష్ణ, దేవరకద్ర ప్రాంత ప్రజలు కోరుతున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నూతనంగా నిర్మించిన ఈ ప్రాజెక్టుతో కే వలం గూడ్స్లకు ప్రా ధాన్యమివ్వటం, ప్రయాణికుల ను పట్టించుకకోకపోవడంతో రైల్వే అధికారుల తీరును ప్రజలు తప్పుపడుతున్నారు.