జడ్చర్ల, జూలై 25 : మండలంలోని బూరెడ్డిపల్లి గ్రామం వద్ద 44వ జాతీయరహదారిపై గల మలుపు నిత్య ప్రమాదాలకు నిలయంగా మారింది. మలుపులో నిత్యం ఏదో ఒ క ప్రమాదం చోటుచేసుకుంటూనే ఉంది. 44వ జాతీయరహదారిపై బూరెడ్డిపల్లి గ్రామం వద్ద మలుపు నుంచి నిత్యం వందలాది వాహనాలు రోడ్డును దాటుతూ ఉంటాయి. జడ్చర్ల మున్సిపాలిటీలోని బాదేపల్లి పట్టణం పెద్ద వ్యాపార కేంద్రం కావడంతోపాటు వ్యవసాయ మార్కెట్, పత్తి మా ర్కెట్, రైల్వేస్టేషన్ ఉంది. దీంతో జడ్చర్ల, భూత్పూర్, మూ సాపేట, ఖిల్లాఘనపురం తదితర ప్రాంతాలకు చెందిన వా రంతా భూత్పూర్ వైపు నుంచి జడ్చర్లకు వస్తుంటారు. ఎ క్కువగా రైతులు, పాలవ్యాపారులు, ఇతర గ్రామాల నుంచి వచ్చే వారంతా బూరెడ్డిపల్లి గ్రామం నుంచే బాదేపల్లికి చేరుకుంటారు. ఇది అందరికీ దగ్గరగా ఉండే మార్గం కావండతో ప్రతినిత్యం పగలనక రాత్రనక రహదారి రద్దీగా ఉంటుంది.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు, పోయేవారు బూరెడ్డిపల్లి వద్ద గల మలుపును దాటాల్సిందే, రోడ్డు దాటే సమయంలో హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు వే గంగా వస్తుంటాయి. ఎందుకంటే ఎత్తు నుంచి కిందకు వ స్తుండడం వల్ల వాహనాలు అతివేగంగా వస్తుంటాయి. ఆ సమయాల్లో వాహనాలు రోడ్డు దాటే సమయంలో ప్రమాదాలకు గురవుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఎంతో మం ది మృత్యువాత పడగా వందలాది మంది క్షతగాత్రులుగా మిగిలారు. అదేవిధంగా మండలంలోని మల్లె బోయిన్పల్లి, గొల్లపల్లి గ్రామాల వద్ద కూడా ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఇంత జరుగుతున్నా జాతీయరహదారు ల సంస్థ అధికారులు తమకు మాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జాతీయరహదారిని విస్తరించే సమయంలో 44వ జాతీయరహదాపై గల గ్రామాల దగ్గర ఫ్లైఓవర్బ్రిడ్జిలు, అండర్ పా స్లు నిర్మించాల్సి ఉన్నా అధికారుల నిర్లక్ష్యం వల్ల ముందు జాగ్రత్తలు పాటించకుండా రోడ్డు నిర్మాణం చేశారు.