వనపర్తి టౌన్, జూలై 25 : ఆత్మవిశ్వాసం మెండుగా ఉండి చదివితే విజయం మీ సొంతమవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం సింగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్సై, కా నిస్టేబుల్ ఉచిత శిక్షణ తీసుకుంటున్న 550 మంది అ భ్యర్థులకు మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎస్పీ రంజన్త్రన్కుమార్తో కలిసి ఉచిత మెటీరియల్‌ను పంపిణీ చేసి అ భ్యర్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఇప్పటికీ 60రోజు లు శిక్షణ పూర్తయిందంటే అభ్యర్థులు మొదటి మెట్టు ఎక్కినట్టేనన్నారు. ఆత్మవిశ్వాసం మెండుగా ఉండాలని, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు మొదటి ప్రయత్నంలో సఫలీకృతం కాలేదని, మొండి పట్టుదలతో పనిచేస్తూ విజయతీరాలను సాధిస్తారన్నారు. తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఐపీఎస్ సాధించార ని, చాలా పేదరికం నుంచి ఉన్నత ఉద్యోగం సాధించారని అలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
అ భ్యర్థులు ఎన్ని ఉద్యోగాలు సాధిస్తే అదే తమకు బహుమతి అని, వారు జీవితంలో స్థిరపడేవరకు తోడుంటామన్నారు. ఈ నెల 30న జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కార్యాలయాన్ని, ఎస్పీ కార్యాలయాన్ని, మెడికల్ కళాశాలను సందర్శించాలన్నారు. వనపర్తి జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఏదులను ఈనెల 2న సందర్శించే ఏర్పాట్లు చేస్తామన్నా రు. ప్రతి ఒక్కరూ 5మొక్కలు నాటి సంరక్షించాలన్నా రు. ఎస్పీ రంజన్త్రన్‌కుమార్ మాట్లాడుతూ మంత్రి నిరంజన్‌రెడ్డి స్ఫూర్తి ప్రదాత అని అన్నారు. తల్లిదండ్రు ల ఆశయాలను నిలబెట్టి వారి జీవితంలో ఆనందం ని లపాలని అభ్యర్థులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ షాకీర్‌హుస్సేన్, డీఎస్పీ ఆనంద్‌రెడ్డి, సీఐ ప్రవీణ్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటీ శ్రీధర్, పీజేఆర్ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు జగదీశ్వర్‌రెడ్డి, ఎస్సైలు యుగంధర్‌రెడ్డి, చంద్రమోహన్, శివ తదితరులు ఉన్నారు.
