అయిజ, జూలై 25 : కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వర ద కొనసాగుతున్నది. వచ్చిన వరదను వచ్చినట్లే 12 గేట్ల నుంచి దిగువకు వదులుతున్నారు. సోమవారం డ్యాంలో 35,385 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 35,383 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. 105.788 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వకుగానూ ప్రస్తుతం 104.824 టీఎంసీల నిల్వ ఉన్నట్లు డ్యాం ఎస్ఈ శ్రీకాంత్‌రెడ్డి, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. అలాగే ఆర్డీఎస్ ఆనకట్టకు 26,330 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, 25,800 క్యూసెక్కులు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నది. ఆయకట్టుకు 530 క్యూసెక్కులు వదిలినట్లు ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో 10 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు పేర్కొన్నారు.
జూరాలకు..
అమరచింత, జూలై 25 : జూరాల రిజర్వాయర్‌కు 23,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. విద్యుదుతృత్తి కోసం 19,505 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. ప్రాజెక్టు నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా.., ప్రస్తుతం 7.645 టీఎంసీలు నిల్వ ఉన్నది. నెట్టెంపాడు లిఫ్ట్‌కు 1500, భీమా లిప్ట్-1కు 1,300, ఎడుమ కాలువకు 920, కుడి కాలువకు 608, సమాంతర కాలువకు 980, భీమా లిప్ట్కు-2కు 750 క్యూసెక్కులు వదులుతున్నారు. దీంతో ప్రాజెక్టు నుంచి మొత్తంగా 25,081 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది.
శ్రీశైలంలో..
శ్రీశైలం, జూలై 25 : శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుము ఖం పట్టింది. రెండు గేట్ల నుంచి విడుదల చేస్తున్న నీటిని సోమవారం తెల్లవారుజామున నిలిపివేశారు. జూరాల ప్రాజెక్టు వి ద్యుదుత్పత్తి ద్వారా 19,744, సుంకేసుల నుంచి 8,414 (మొ త్తం 28,158 క్యూసెక్కులు) విడుదల కాగా, సాయంత్రానికి 58 వేల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో నమోదైంది. కాగా, ఏపీ పవర్‌హౌస్‌లో 27,533, టీఎస్ పవర్‌హౌస్‌లో 31,784 క్యూ సెక్కులతో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 881.60 అడుగులు ఉన్నది. ప్రస్తుతం 196.56 టీఎంసీలు నిల్వ ఉన్నది.