జడ్చర్ల, జూలై 22 : ప్రభుత్వం పల్లె, బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యసేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందని జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య అన్నా రు. జడ్చర్ల మండలంలోని గైరాన్తండాలో శుక్రవారం వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా తండావాసులకు టీబీ ఇతర పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందజేశారు. వైద్యశిబిరాన్ని జెడ్పీ వైస్‌చైర్మన్ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్ర భుత్వం అధికారంలోకి వచ్చాక సామాన్య ప్రజలకు అన్నిరకాల వైద్యసేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ దవాఖానలను తీర్చిదిద్ది మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా గైరాన్‌తండా ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంత రం విద్యార్థులకు నోట్‌పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ సమత, ఎంపీడీవో ఉమాదేవి, సర్పంచ్ మోహన్‌నాయక్, పంచాయతీ కార్యదర్శి శేఖర్, రాంచంద్రయ్య, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.