భూత్పూర్, జూలై 22 : ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబీమా పథకం దేశానికే ఆదర్శమని దేవరకద్ర ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. భూత్పూర్కు చెందిన రైతులు గొడుగు సత్యయ్య, షహనాజ్, శంకరయ్య, శేరిపల్లి-బీకి చెందిన దానమ్మ, అమిస్తాపూర్‌కు చెందిన నా ర్యానాయక్ ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందారు. వారి కుటుంబసభ్యులకు ప్రభుత్వం మంజూరు చేసిన రైతుబీమా చెక్కులను శుక్రవారం భూత్పూర్లో ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతన్న సంక్షేమమే ధ్యేయం గా ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని పథకాలను ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. కాగా, చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు ఎస్సీ కమ్యూనిటీహాల్ నిర్మాణానికి త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, ముడా డైరెక్టర్ చంద్రశేఖర్‌గౌడ్, కౌన్సిలర్లు శ్రీనివాస్‌రెడ్డి, బాలకోటి, మాజీ ఎంపీపీ చంద్రమౌళి, నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, గడ్డం రాము లు, రామునాయక్, బోరింగ్ నర్సింహులు, ప్రేమ్, యాద య్య, డాక్టర్ సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.