ఊట్కూర్, జూలై 22 : ప్రభుత్వ వసతులను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సర్పంచులు సూర్యప్రకాశ్‌రెడ్డి, యశోదమ్మ అన్నా రు. ఊట్కూర్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, నిడుగుర్తి ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు శుక్రవారం పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనకు చర్యలు తీసుకుందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రాఘవరెడ్డి, ప్రధానోపాధ్యాయు లు లక్ష్మారెడ్డి, సురేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నోటుపుస్తకాలు పంపిణీ
మండలంలోని తీలేరు ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు నోటుపుస్తకాలను గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు మల్లేశ్ సొం త ఖర్చులతో జెడ్పీ వైస్ చైర్పర్సన్ సురేఖారెడ్డితో కలిసి పం పిణీ చేశారు. ఈ సందర్భంగా సురేఖారెడ్డి మాట్లాడుతూ వి ద్యార్థులకు మల్లేశ్ నోటుపుస్తకాలను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఉపాధ్యాయ బృందం మల్లేశ్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ యూత్ విభాగం మండల అధ్యక్షుడు రాజేశ్, నాయకులు అశోక్, యువరాజ్గౌడ్, వార్డు మెంబర్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
పాఠశాల పరిశీలన
మండలంలోని కంసాన్పల్లి పాఠశాలను మండల విద్యాధికారి వెంకటయ్య శుక్రవారం ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో భాగంగా పరిశీలించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల కమిటీ చైర్మన్‌తో సమావేశమై తరగతి గదుల్లో విద్యుత్ దీపాల ఏర్పాటు, పరిసరాల పరిశుభ్రత, గదుల మన్నిక తదితర విషయాలపై చర్చించి పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
చిట్యాల ఎంయూపీఎస్ పాఠశాలలో…
మండలంలోని చిట్యాల ఎంయూపీఎస్ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు ప్రభు త్వం సరఫరా చేసిన పాఠ్యపుస్తకాలను సర్పంచ్ జానకి పం పిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రాంలింగప్ప, ఎస్ఎంసీ చైర్మన్ శ్రీనివాసులు, నాయకులు లక్ష్మయ్య, అబ్దుల్‌హుస్సేన్, దత్తు, వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు.
పట్టుదలతో చదివితే దేనినైనా సాధించొచ్చు
కృషి, పట్టుదల, లక్ష్యంతో చదివితే దేనినైనా సాధించవచ్చని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్, మున్సిపల్ వైస్‌చైర్మన్ హరినారాయణభట్టడ్ అన్నారు. మండలంలోని తిర్మలాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం లయన్స్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటుపుస్తకాలను పంపిణీ చేశారు. అలాగే మెడికల్ బాక్స్‌ను అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం, క్లబ్ అధ్యక్షుడు జనార్దన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జగదీశ్, కార్యదర్శి సాయినాథ్, కోశాధికారి రవిగౌడ్, సభ్యులు, ఎంపీటీసీ బస్సప్ప, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
హరిజనవాడ ఉన్నత పాఠశాలలో…
మున్సిపాలిటీలోని హరిజనవాడ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శుక్రవారం విద్యుత్‌శాఖ లైన్మెన్లు నోటుపుస్తకాలు, ఫౌచులు, వాటర్‌ఫిల్టర్, వైట్మార్కర్ బోర్డులను అందజేశారు. అలాగే పాఠశాలలో క్రీడామైదానాన్ని చదును చేయించారు. కార్యక్రమంలో లైన్మెన్లు హుస్సేన్, శ్రీనివాస్, తిరుపతి, కౌన్సిలర్ రమేశ్, హెచ్ఎం ఉమాదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.