మహబూబ్‌నగర్, జూలై 19 : జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథిగృహం ఆవరణలో చేపట్టిన వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. వెజ్, నాన్‌వెజ్ మా ర్కెట్ పనులను మంగళవారం పరిశీలించారు. ఈ సంద ర్భంగా నిర్మాణానికి వినియోగిస్తున్న సిమెంట్, స్టీల్, లేబర్ తదితర వివరాలను తెలుసుకున్నారు. ఎక్కువ మంది కూలీలను పనులకు వినియోగించి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. సెంట్రింగ్ పనులకు దళితబంధు యూనిట్లను అనుసంధానం చేయాలని చెప్పారు. కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఈఈ విజయభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
‘మనబస్తీ-మనబడి’ పనుల పరిశీలన
జిల్లా కేంద్రంలోని రాంనగర్ పాఠశాలలో చేపట్టిన మనబస్తీ-మనబడి పనులను కలెక్టర్ వెంకట్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంబంధిత అధికారులు పర్యవేక్షణ పెంచి పనులను వేగవంతం చేయాలని సూచించారు. రూ.21,73,389తో అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో జయశ్రీ, ఎంఈ సుబ్రహ్మణ్యం, ఏఈ పృథ్వీ పాల్గొన్నారు.
అన్నిరకాల వైద్యపరీక్షలు చేయాలి
జిల్లా కేంద్రంలోని బస్తీ దవాఖానల్లో అన్నిరకాల వైద్యపరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ వెంకట్రావు ఆదేశించారు. పాతపాలమూరు బస్తీ దవాఖానను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బస్తీ దవాఖానలతోపాటు పట్టణ ఆరోగ్యకేంద్రాల్లో ప్రభుత్వం సూచించిన 54రకాల ఉచిత పరీక్షలు నిర్వహించి పేదలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అలాగే మందుల స్టాక్, బస్తీ దవాఖానకు వచ్చే రోగుల సంఖ్య, ఫార్మసిస్టు, ల్యాబ్ అసిస్టెంట్ తదితర వివరాలను తెలుసుకున్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశాల మేరకు బస్తీ దవాఖానల్లో అసిస్టెంట్లను ఏర్పాటు చేసి వెంటనే అన్నిరకాల పరీక్షలను ఉచితంగా నిర్వహించాలని సూచించారు. అలాగే కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై కలెక్టర్ ఆరా తీశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో కృష్ణ, డాక్టర్ రఫీ, వైద్యారోగ్యశాఖ కార్యాలయ ఏవో భాస్కర్‌నాయక్, డాక్టర్ ఎసీమ్ ముస్తాక్, నవకాంత్ తదితరులు పాల్గొన్నారు.