బాలానగర్, జూలై 19 : హరితహారం కార్యక్రమంలో నాటిన ప్రతిమొక్కనూ సంరక్షించాలని జెడ్పీటీసీ కల్యాణి కోరారు. మండలంలోని చింతకుంటతండాలో మంగళవా రం మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం తండావాసులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కల పెంపకంతోనే జీవరాశి మనుగడ సాధ్యమవుతుందన్నారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతిఒక్కరూ మొక్కలను నాటి పెంచాలని కోరారు. అదేవిధంగా బాలానగర్ అంగన్వాడీ కేంద్రం-1లో చిన్నారులతో కలిసి అంగన్వాడీ టీచర్ కమల మొక్కలను నాటారు. కార్యక్రమంలో గిరిజన నాయకుడు లక్ష్మణ్‌నాయక్, సర్పంచ్ రేణుక, కార్యదర్శి పాండు, భాస్కర్‌నాయక్ పాల్గొన్నారు.
భాగస్వాములు కావాలి
రాజాపూర్, జూలై 19 : హరితహారం కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి అన్నారు. మండలకేంద్రంలో ఇంటింటికీ పూలు, పండ్ల మొక్కలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో పెద్దఎత్తున మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, సత్యయ్య, అచ్చయ్య, నర్సింహులు, బుగ్గయ్య, గోవర్ధన్‌రెడ్డి, నజీమ్, లింగం తదితరులు పాల్గొన్నారు.
మొక్కలను సిద్ధం చేయాలి
మహబూబ్‌నగర్‌టౌన్, జూలై 19 : నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను పంపిణీకి సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్ అన్నారు. మున్సిపాలిటీలోని పలు నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో పెద్దఎత్తున మొక్కలు నాటి పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
రేణుకాఎల్లమ్మ ఆలయంలో..
జడ్చర్లటౌన్, జూలై 19 : మున్సిపాలిటీలోని విద్యానగర్‌కాలనీ రేణుకాఎల్లమ్మ ఆలయ ఆవరణలో మన సేవాసమితి సభ్యులు మొక్కలు నాటారు. ముందుగా ఆలయంలో ప్రత్యే క పూజలు చేశారు. కార్యక్రమంలో మన సేవాసమితి ప్రధానకార్యదర్శి యెన్నం రాఘవేందర్, తులసి, గోపాల్‌గౌడ్, ఓగనెల రాధాకృష్ణ, మంజుల తదితరులు పాల్గొన్నారు.