మక్తల్ రూరల్, జూలై 18 : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కృష్ణమ్మ (కృష్ణానది) పరవళ్లు తొక్కుతున్నది. మండలంలోని సంగంబండ (చిట్టెం నర్సిరెడ్డి), భూత్పూర్ బాలెన్సింగ్ రిజర్వాయర్లు జలకళ సంతరించుకున్నవి. మండలంలోని చిన్నగోప్లాపూర్ వద్ద నిర్మించిన రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం మొదటి దశలో రైతులకు సాగునీరు అందించేందుకు గతనెల 24న భీ మా ఫేజ్(1) పంపు హౌస్ నుంచి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. కెనాల్ నుంచి సంగంబండ (చిట్టెం నర్సిరెడ్డి), భూత్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను నింపుతా రు.
కాగా గతేడాది కన్నా ఈసారి కృష్ణానదికి వరదలు ఆలస్యం గా రావండతో ప్రాజెక్టులు నింపడానికి నెలరోజుల సమయం పట్టిందని ఇంజినీరింగ్ అధికారులు పేర్కొన్నారు. ఇటీవల కర్ణాటక ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు కృష్ణానదిలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. ప్రస్తుతం దా దాపు లక్షా70వేల క్యూసెక్యులకుపైగా వరదనీ రు వస్తున్నది. దీంతో మక్తల్, మాగనూర్, కృష్ణ మండలాల్లోని పరీవాహక ప్రాంతంలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు పుష్కలంగా సాగునీరు లభిస్తున్నది. దీంతో ఈ ఏడాది వానకాలం పం టలకు సాగునీటి సమస్యలు తీరడంతో మండ లాల్లోని ఆయా గ్రామాల ఆయకట్టు రైతులు హ ర్షం వ్యక్తం చేశారు.
నిండుకుండల్లా రిజర్వాయర్లు
మండలంలోని సంగంబండ గ్రామం వద్ద పెద్దవాగుపై నిర్మించిన సంగంబండ (చిట్టెం నర్సిరెడ్డి), భూత్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు క్ర మంగా నిండుతున్నాయి. చిన్నగోప్లాపూర్ వద్ద నిర్మించిన రాజీ వ్ భీమా ఎత్తిపోతల పథకం మొ దటి దశ లిఫ్ట్ 1 నుంచి గ్రావెటీ కెనాల్‌తో మక్తల్ వద్ద నిర్మించిన పంపుహౌస్ లిఫ్ట్ 2 వద్ద మూడు మోటర్ పంపుల నుంచి సంగంబండ రిజర్వాయర్‌కు గ్రావెటీ కె నాల్ నుంచి నీటిని తరలిస్తున్నా రు.
ఇదిలా ఉండగా చందాపూర్ సమీపంలో భారీ వర్షాల వల్ల కా ల్వ దెబ్బ తినడంతో ప్రస్తుతం ఒక మోటర్ మాత్రమే రన్ చేసి 400 క్యూసెక్యుల నీటిని వదులుతున్నట్లు ప్రా జెక్టు ఏఈ హమీద్ సోమవారం “నమస్తే తెలంగాణాకు” తెలిపారు. ప్రస్తుతం సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 1. 7 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. ప్రాజెక్టు మొత్తం 3.313 టీఎంసీల నీటి సామర్థ్యం ఉంది. నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 63వేల ఎకరాలు, భూత్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 38వేలు, మొత్తం లక్షా11వేల ఎకరాలకు సా గునీరు అందుతున్నది. వారం రోజుల్లో పూర్తిస్థాయి నీటి మట్టం చేరుకుంటుందని నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులు అంచనా వేశారు.
పుష్కరఘాట్‌ను తాకిన వరదనీరు
ఇదిలా ఉండగా కృష్ణానదికి అంతకంతకు వరదనీరు పెరుగుతుండడంతో మండలంలోని పస్పుల వద్ద శ్రీక్షేత్రవల్లభాపురం లో ప్రసిద్ధ దత్తాత్రేయస్వామి ఆలయం వద్ద పుష్కరఘాట్‌ను తాకింది. నిన్నటి వరకు కర్ణాటక ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి డ్యామ్ నుంచి లక్ష క్యూసెక్యుల నీరు వస్తుండగా సోమవారం 1.70వేల క్యూసెక్యుల నీరు దిగువకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో కృష్ణానదికి వరదనీటి తాకిడి మరింత పెరిగింది. నదీపరీవాహక ప్రాంతంలోని లోతట్టు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
రైతులకు సకాలంలో సాగునీరు
మక్తల్ నియోజకవర్గంలో ఆయా ప్రాజెక్టుల కింద రైతులకు సకాలంలో సాగునీరు అందించడానికి కృషి చేస్తున్నాం. కృష్ణానదికి వరదలు రావడం వల్ల ప్రాజెక్టులకు పంపుహౌస్‌ల నుంచి నీటిని విడుదల చేయడమైంది. వీలైనంతా త్వరగా డ్యాంలను నింపి రైతులకు సాగునీటిని అందించాలని అధికారులను ఆదేశించాం. కురుస్తున్న వర్షాలకు మండలంలోని భూత్పూర్ వద్ద నర్వ మండలానికి వెళ్లే గ్రావెటి కెనాల్‌కు గండ్లు పడ్డాయి. అలాగే ఆదివారం కురిసిన భారీ వర్షాలకు సంగంబండ గ్రావెటీ కెనాల్ కోతకు గురైంది. కాల్వకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించాం. రిజర్వాయర్ల కింద వానకాలం పంటలను సాగు చేసుకోవడానికి రైతులకు అదునులోగా నీరు అందించి ఎక్కడా సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం.
– చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే