అయిజ, జూలై 18 : కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద స్థిరంగా కొనసాగుతున్నది. సోమవారం 31 గేట్లు ఎత్తి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యాంలో 1,67,136 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 1,45,975 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. డ్యాం పూ ర్తి స్థాయి నీటి నిల్వ 105.788 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 97.296 టీఎంసీ లు నిల్వ ఉన్నట్లు టీబీ డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. అలాగే ఆర్డీఎ స్ ఆనకట్టకు 1,55,684 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, 1,55,130 క్యూసెక్కు లు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుం కేసుల బ్యారేజీకి చేరుతున్నది. అలాగే ఆ యకట్టుకు 554 క్యూసెక్కులు వదిలిన ట్లు ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో 14.1 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు పేర్కొన్నారు.
సుంకేసుల బ్యారేజీలో..
రాజోళి, జూలై 18 : సుంకేసుల బ్యా రేజీలో వరద గంటగంటకూ పెరుగుతున్నది. బ్యారేజీకి 1,67,134 క్యూసెక్కు లు వస్తుండగా.. 27 గేట్లను 2 మీటర్ల మేర ఎత్తి 1,65,122 క్యూసెక్కులు వదులుతున్నట్లు ఏఈ రాజు తెలిపారు. బ్యారేజీలో ప్రస్తుతం 0.438 టీఎంసీలు నిల్వ ఉన్నది. ఆర్డీఎస్ ప్రధాన కాలువకు 2,012 క్యూసెక్కులు వదిలామన్నారు.
జూరాల ప్రాజెక్టుకు..
అమరచింత, జూలై 18 : జూరాల జ లాశయానికి వరద భారీగా వస్తున్నది. సోమవారం సాయంత్రం జూరాల ప్రా జెక్టుకు 1.65 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. కాగా, 23 గేట్ల నుంచి 1,3 6,798, పవర్‌హౌస్ నుంచి 34,392 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయానికి వ దిలారు. అలాగే నెట్టెంపాడు ఎత్తిపోతల కు 1,500, భీమా-1కు 1,300, భీ మా-2కు 500, ఎడమ కాలువకు 920, కుడి కాలువకు 210 క్యూసెక్కు లు వదిలారు. దీంతో ప్రాజెక్టు నుంచి మొత్తం 1,75,687 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా, ప్ర స్తుతం 8.029 టీఎంసీలు నిల్వ ఉన్నది.
శ్రీశైలం ప్రాజెక్టుకు..
శ్రీశైలం, జూలై 18 : శ్రీశైలం జలాశయానికి సోమవారం సాయంత్రం జూ రాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల నుంచి 1,22, 494, విద్యుదుత్పత్తి నుంచి 35,451, సుంకేసుల నుంచి 1,65,122 (మొత్తం 3,23,067 క్యూసెక్కులు) విడుదలయ్యాయి. కాగా, శ్రీశైలం జలాశయంలోకి 3,27,799 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థా యి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 869.10 అడుగులు ఉండగా, పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 137.9335 టీఎంసీలు నీటి నిల్వ ఉన్నది. టీఎస్ పవర్‌హౌస్‌లో విద్యుదుత్పత్తిని ప్రారంభించి 25,427 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
మునిగిన సంగమేశ్వరాలయం
కొల్లాపూర్, జూలై 18 : కృష్ణానది అవతలి వైపున ఉన్న సంగమేశ్వరాలయం ఆదివారం రాత్రి పూర్తిగా మునిగిపోయింది. ఆలయ గాలి గోపురంపై ఏ ర్పాటు చేసిన కాషాయపు జెండా సైతం మునిగింది.