రైల్వే అండర్ పాస్‌ల నుంచి వెళ్లాలంటే జనాలు జంకుతున్నారు. చిన్నపాటి వర్షాలకే నీళ్లు చేరడంతో లోపభూయిష్ట నిర్మాణాలతో వాహన దారులు నానా అవస్థలు పడుతున్నారు. వర్షపు నీటిని మళ్లించేందుకు డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో రోజుల తరబడి నీళ్లు అక్కడే నిలుస్తున్నాయి. దీంతో రైల్వే లైన్‌కు అటు ఇటు ఉన్న గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లోనూ వెళ్లలేని పరిస్థితి దాపురించడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఇటీవల మాచన్‌పల్లి-కోడూరు రైల్వే అండర్‌పాస్ వద్ద వర్షపు నీటిలో స్కూల్ బస్సు ఇరుక్కోగా 36మంది చిన్నారులను సురక్షితంగా బయటకు తీయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ రైల్వే అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైల్వే అండర్‌పాస్‌లు మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. చిన్నపాటి వర్షాలకే అండర్‌పాస్‌ల్లో నీరు నిలుస్తున్నది. ఆ నీరు సాఫీగా వెళ్లేందు కు డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో రోజుల తరబడి నీళ్లు నిలుస్తున్నాయి. దీంతో రైల్వేలైన్‌కు అ టు, ఇటు ఉన్న గ్రామాల రాకపోకలకు ఇబందులు ఏర్పడ్డాయి. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు కూడా వెళ్లలేని దుస్థితి నెలకొంటున్నది. ఇటీవల కోడూర్ వద్ద ఉన్న అండర్‌పాస్‌లో నిలిచిన నీటిలో స్కూల్ బస్సు ఇరుక్కున్నది. బస్సులో ఉన్న 30 మంది చిన్నారులను సురక్షితంగా రక్షించారు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ రైల్వే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాలానగర్ నుంచి అలంపూర్ వరకు..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సిగ్నల్ వ్యవస్థ లేకుండా ప్రజలు రైలు పట్టాలు దాటి రాకపోకలు సా గించే వీలుగా అండర్‌పాస్‌లను నిర్మించారు. మహబూబ్‌నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో సుమారు 161 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ ఉన్నది. అనేక రైళ్లు వెళ్తుంటాయి. ఈ క్రమంలో చీటికి మాటికి గేట్ వేయడం, ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడడం వంటి ఇబ్బందులు తొలగించేదుకు మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా అండర్‌పాస్‌లకు నిర్మించారు. బాలానగర్ నుంచి కర్నూల్ వరకు దాదాపు 30 అండర్‌పాస్‌లు ఉన్నాయి. మరికొన్ని ని ర్మాణ దశలో ఉన్నాయి. బాలానగర్, పెద్దాయిపల్లి, రాజాపూర్, మాచర్ల, గొల్లపల్లి, జడ్చర్ల, ఎస్వీఎస్ హా స్సిటల్, పాలిటెక్నిక్ కళాశాల, కోడూరు, వెంకటాయపల్లి, దేవరకద్ర, కౌకుంట్ల, పేరూర్, కొన్నూరు, గద్వాల-పూడురు మధ్య రెండు, ఇటిక్యాల వరకు ఐదు, మానవపాడు వరకు మూడు, అలంపూర్ వరకు మూడు.. అక్కడి నుంచి కర్నూల్ వరకు రెండు అండర్పాస్లున్నాయి. మరో ఆరు చోట్ల నిర్మించేందుకు ప్రతిపాదించారు.
వానకాలం వచ్చిందంటే పరేషానే..
కార్లు, కొన్ని చోట్ల బస్సులు కూడా తిరిగేలా అండర్‌పాస్‌లు డిజైన్ చేశారు. సిగ్నల్ లేకుండా రాకపోకలు సాగించేందుకు వీలుగా నిర్మించారు. అయితే, ఇప్పుడు అండర్‌పాస్‌లు వానకాలంలో వాహనదారు లకు పరీక్షలు పెడుతున్నాయి. 2019లో రాజాపూర్ అండర్‌పాస్ బ్రిడ్జిలో కారు, బైక్ చిక్కుకోగా, ప్రమా దం నుంచి బయటపడ్డారు. భారీ వర్షాలు పడితే చా లు ఈ అండర్‌పాస్ మధ్య రాకపోకలు నిలిచిపోవడం ఖాయం. అయితే ఈ వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు డ్రైనేజీ వ్యవస్థ ఉన్నప్పటికీ.. పెద్ద మొత్తంలో నీళ్లు చేరితే వెళ్లేందుకు దాదాపు మూడు, నాలుగు గంటల సమయం పడుతుంది. రాత్రివేళ నీళ్లు నిలిచిపోతే ఇక అంతే సంగతులు. కాగా, ఇటీవల 30 మం దితో వెళ్తున్న పాఠశాల బస్సు మాచన్‌పల్లి వద్ద ఉన్న అండర్‌పాస్ బ్రిడ్జిలో నిలిచిపోయింది. ఈ ఘటనపై విమర్శలు తలెత్తుతున్నాయి. కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులే మోటార్లు పెట్టి నీటిని పంపింగ్ చేస్తున్నారు.
కేసు మాత్రమే నమోదు చేశారు..
కోడూర్ వద్ద జరిగిన ప్రమాద ఘటనకు కార ణమైన భాష్యం టెక్నో స్కూల్‌పై జిల్లా విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌పై కేసు మాత్రమే నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. పాఠశాల బస్సు డ్రైవర్లకు రవాణా శాఖ అధికారులు కూడా ముందు జాగ్రత్త చర్యలు వివరించకపోవడం విడ్డూరం. జిల్లా అధికారులు కూడా ఈ ఘటనను తేలికగా తీసుకున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.