మహబూబ్‌నగర్ రూరల్, జూలై 13: జిల్లావ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా సాయిబాబా ఆలయాల్లో ప్ర త్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే సాయిబాబా మందిరాలకు భక్తు లు పోటెత్తారు. జిల్లా కేంద్రంలోని సాయిబాబా మందిరాలు భక్తులతో కిటకిటలాడా యి. సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సం దర్భంగా సాయినామస్మరణ మార్మోగింది. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆల
మూసాపేట(అడ్డాకుల), జూలై 13 : మండలంలోని కందూరు స్టేజీ వద్దనున్న షిర్డీ సాయిబాబా ఆలయంలో నిర్వహించిన గురుపౌర్ణమి వేడుకల్లో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ నిర్వాహకులు కృష్ణయ్య ఆధ్వర్యంలో కందూరు, శాఖాపూర్ గ్రామస్తులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యేతోపాటు, ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి, సర్పంచ్ శ్రీకాంత్, రమేశ్‌గౌడ్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ జయన్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
భూత్పూర్ మండలంలో..
భూత్పూర్, జూలై 13 : మండలంలోని అమిస్తాపూర్ షిర్డీసాయి ఆశ్రమం, శేరిపల్లి(బీ)లోని విశ్వసాయి మందిరంలో గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తులు తెల్లవారుజామునుంచే సాయిబాబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం పల్లకీసేవ, హారతి కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అలాగే దత్తాత్రేయుడికి పూజలు చేశారు. కార్యక్రమంలో అర్చకుడు సాయిరాం పాల్గొన్నారు.
జడ్చర్ల పట్టణంలో..
జడ్చర్ల, జూలై 13 : పట్టణంలోని సకలదేవతల ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు యోగీశ్వర్, దుర్గాప్రసాద్, చిన్నయ్యస్వామి ఆధ్వర్యంలో షిర్డీ సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాయినాథుడికి పల్లకీసేవ నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పాలాది రమేశ్, రాఘవేంద్ర, శ్రీనివాస్, కృష్ణారావు, రాజనర్సింహులు, యాదిరెడ్డి, రాజు, యాదమ్మ, జయమ్మ, లావణ్య పా ల్గొన్నారు. అలాగే మండలంలోని కుర్వగడ్డపల్లి మీనాంబరం పర్శవేదీశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు గోపాల్, బాలింగప్ప, శ్రీనివాసులు, శ్రీశై లం, శ్రీకాంత్, రంగాచారి పాల్గొన్నారు.
కోయిలకొండ మండలంలో..
కోయిలకొండ, జూలై 13 : మండలంలోని గార్లపాడ్, మల్కాపూర్, వింజమూర్, కోయిలకొండ, పారుపల్లి తదితర గ్రామాల్లో వ్యాస, గురుపౌర్ణమి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో అభిషేకం, గురుపాదుక పూజ, గాయత్రీహోమం తదితర పూజలు చేశారు. మండలకేంద్రంలోని ఆది ఆంజనేయస్వా మి ఆలయంలో సామూహికంగా రమాసహిత సత్యనారాయణ వ్రతాలు చేశారు.
దేవరకద్ర మండలంలో..
దేవరకద్ర రూరల్, జూలై 13 : మండలంలోని పలు గ్రామాల్లో గురుపౌర్ణమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మండలకేంద్రంలోని ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో సాయినాథుడికి ఆర్యవైశ్యులు సు గంధజలాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అదేవిధంగా లక్ష్మీపల్లి కనకదుర్గా ఆలయంలో సాయిబాబా ఆలయంలో తెల్లవారుజామునుంచే ప్రత్యేక పూజా కా ర్యక్రమాలు నిర్వహించారు.