కృష్ణ, జూలై 13 : ఆధ్యాత్మిక జీవనంతో మానసిక ప్ర శాంతత లభిస్తుందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అ న్నారు. గురుపౌర్ణమి సందర్భంగా బుధవారం మండలం లోని గుడెబల్లూర్ పంచాయతీ పరిధిలోని టైరోడ్ సమీపం లో కృష్ణా నది తీరాన నూతనంగా నిర్మించిన ఓంకారాశ్రమంలో వాస్తు పూజ, యజ్ఞం, శివలింగ ప్రతిష్ఠాపన, శ్రీచక్ర ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే చిట్టెం మాట్లాడుతూ ప్రతిఒక్కరూ గురువులపై భక్తిభావంతో మెలగాలని, తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదని సూచించారు. యజ్ఞంలో పలువురు దంపతులు పాల్గొని అగ్నికి నె య్యి, సుగంధద్రవ్యాలు సమర్పించారు. ఆచార్య ఓంకారానందగిరి ఆధ్వర్యంలో ఉదయం నుంచి 12 గంటల వరకు నిర్వహించిన పూజల్లో ఎమ్మెల్యే పాల్గొని పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే చిట్టెంను ఆశ్రమ కమిటీ సభ్యులు సన్మా నించారు. కార్యక్రమంలో మాజీ ట్రేడ్ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్ మల్లప్ప, ఊట్కూర్ ఎంపీపీ లక్ష్మి, గుడెబల్లూ ర్ సర్పంచ్ మహదేవమ్మ, ఆశ్రమ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అనాథ శరణాలయానికి భూమిపూజ
మండలంలోని నేరడగంలో పచ్చిమాద్రి సంస్థా న విరక్త మఠం ఆవరణలో అనాథ శరణాలయం భవన నిర్మాణ కోసం పచ్చిమాద్రి సంస్థాన విరక్త మఠం పీఠాధిప తి సిద్ధలింగ మహాస్వామి ఆధ్వర్యంలో బుధవారం భూమిపూజ నిర్వహించా రు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎ మ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి హాజరై భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సిద్ధలింగ మహాస్వామి మాట్లాడుతూ తల్లిదండ్రు లు, తల్లి, తండ్రిని కోల్పోయిన చిన్నారులను ఆదుకోనేందుకు అనాథ శరణాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గురుపౌర్ణమి సందర్భంగా అనాథ శరణాలయానికి జగద్గురువు డాక్టర్ సంఘన బసవేశ్వర అనాథ శరణాలయంగా నామకరణం చేశారమన్నారు. గురుపౌర్ణమి సందర్భంగా మఠం లో ప్రత్యేక పూజలు నిర్వహించి సిద్ధలింగ మహాస్వామి పా దపూజ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే చిట్టెంను సి ద్ధలింగ మహాస్వామి శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ అశోక్‌గౌడ్, జెడ్పీటీసీ వెంకట య్య, ఎంపీటీసీ ఎల్లారెడ్డి, డీడబ్ల్యూవో వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.