మహబూబ్‌నగర్‌టౌన్, జూలై 13 : వర్షానికి పడిపోయే ఇండ్లను గుర్తించాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలోని టీడీగుట్టలో బుధవారం పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ మున్సిపాలిటీలు, గ్రామాల్లో అధికారులు పర్యటించి ప్రతి ఇంటినీ పరిశీలించాలని తెలిపారు. వర్షానికి పడిపోయే అవకాశమున్న ఇండ్ల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. కాగా, టీటీగుట్ట పాఠశాల ఎదుట రోడ్డు దె బ్బతిన్నదని, మరమ్మతు చేయించాలని కాలనీవాసులు కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమా ర్, సిబ్బంది పాల్గొన్నారు.
జాగ్రత్తలు పాటించాలి
దేవరకద్ర రూరల్, జూలై 13 : ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మండల ప్రత్యేకాధికారి శంకరాచారి సూచించారు. మండలంలోని నార్లోనికుంటలో బుధవారం మండల అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పాత ఇండ్లల్లో నివాసముం టున్న వారికి పలు జాగ్రత్తలు చెప్పారు. మ ట్టి ఇండ్లలో ఉన్నవారు అవసరమైతే రాత్రివేళ ప్రభుత్వ భవనాల్లో ఉండాలని సూచించారు. రైతులు కూడా వ్యవసాయ మోటర్ల వద్ద జాగ్రత్తగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసులు, ఎంపీవో శ్రీనివాసరావు, సర్పంచ్ రామాంజనేయు లు, పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్, వీఆర్ఏ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రమాదాల బారిన పడొద్దు
కోయిలకొండ, జూలై 13 : విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో జయరాం కోరారు. మండలంలోని గార్లపాడ్, దమాయపల్లి, అభంగపట్నం, గంగ్యానాయక్తండా, మల్కాపూర్ తదితర గ్రామాల్లో పర్యటించి ప్రజలకు జాగ్రత్తలు తెలిపారు. ముసురు వర్షాలు కురుస్తున్నందున విద్యుత్‌వైర్లు, వ్యవసాయ మోటర్లు, స్తంభాల వద్దకు వెళ్లొద్దని తెలిపారు. మండలంలో ఆరు బృందాలుగా అధికారులు ఏర్పడి పరిస్థితిని సమీక్షిస్తున్నారని పేర్కొన్నారు.