బాలానగర్, జూలై 13 : తండాల రూపురేఖలు మా ర్చేందుకు సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం మండల పర్యటనలో భాగంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు, పార్టీ బీమా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తండాలను ప్రత్యేక పంచాయతీలుగా చేసిన కేసీఆర్ తాజాగా వా టికి రూ. 25 లక్షల చొప్పున గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జడ్చర్ల నియోజకవర్గంలో 52గిరిజన పంచాయతీలకు నిధులు మంజూరైనట్లు తెలిపారు. అలాగే మండలంలోని గాలిగూడెం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త రవి ప్రమాదవశాత్తు మృతి చెందగా, రవి పార్టీ స భ్యత్వం కలిగి ఉండటంతో అతని భార్య అనురాధకు రూ.2లక్షల బీమా చెక్కును ఎమ్మెల్యే అందించారు. అ లాగే మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఏడుగురికి సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 5.35 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధితులకు అందజేశారు.
అంతకుముందు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కంటి దవాఖానను ఎమ్మె ల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి నామ్యాతం డా సర్పంచ్ ఫీర్యానాయక్, ఉప సర్పంచ్ మణి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావాలని వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్‌రెడ్డి, గిరిజన సంఘం రాష్ట్ర నాయకుడు లక్ష్మణ్‌నాయక్, ఎంపీటీసీ అభిమన్యురెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటాచారి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాసరావు, మండల ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి, వర్కింగ్ మండలాధ్యక్షుడు బాలూనాయక్, యూత్ వింగ్ మండలాధ్యక్షుడు సుప్ప ప్రకాశ్, మండ ల ఉపాధ్యక్షుడు రమేశ్‌నాయక్, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు యాదయ్య, రైతుబంధు సమితి మండలాధ్యక్షు డు గోపాల్‌రెడ్డి, సింగిల్‌విండో డైరెక్టర్ మంజూనాయక్, సర్పంచులు తిరుతినాయక్, గోపీనాయక్, రమేశ్‌నాయక్, జగన్ నాయక్, తదితరులు ఉన్నారు.