ధన్వాడ, జూలై 12 : అత్యవసర సమయాల్లో ప్రజలు అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మె ల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ దవాఖానలో ప్రభుత్వం నుంచి మంజూరైనా అంబులెన్స్‌కు మంగళవారం ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలానికి అం బులెన్స్ లేనందున బాలింతలతోపాటుగా అత్యవసర చికి త్స కావాల్సిన ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఇటీవల జిల్లాలో పర్యటించిన మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావును మండలానికి అంబులె న్స్ కావాలని ప్రజల తరఫున వినతిపత్రం అందించామన్నారు. దీంతో మంత్రులు ప్రత్యేక చొరవ తీసుకొని మండలానికి అంబులెన్స్‌ను మంజూరు చేశారన్నారు.
కార్యక్రమంలో డీఎంహెచ్‌వో రామ్‌మనోహర్‌రావు, మండల వై ద్యాధికారి వెంకట్‌దాస్, సూపర్వైజర్ కతలప్ప, ఆశమ్మ, టీ ఆర్ఎస్ ధన్వాడ, మరికల్ ఇన్చార్జి రాజవర్ధన్‌రెడ్డి, మం డలాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, సర్పంచ్ అమరేందర్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి చంద్రశేఖర్, కోశాధికారి నారాయణస్వామి, యూత్ మండల అధ్యక్షుడు సునీల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు సచి న్, విండో వైస్‌చైర్మన్ బాలరాజు, దవాఖాన సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.