మక్తల్ రూరల్, జూలై 11 : మండలంలోని భూత్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కెనాల్‌కు భారీ వర్షాల వల్ల గండిపడి తెగిపోవడంతో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ప్రత్యే క చొరవతో యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టారు. మండలంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల పెద్దఎత్తున వరదనీటి ప్రవాహానికి భూత్పూర్ రిజర్వాయర్ కెనాల్‌కు గండిపడి దె బ్బతినింది. రిజర్వాయర్ నుంచి నర్వ మండలం వివిధ గ్రా మాల రైతుల సాగు భూములకు నీళ్లు అందుతున్నాయి. కెనాల్‌కు గండిపడడంతో ప్రస్తుతం వానాకాలంలో రైతులు పంటలు వేసుకోవడానికి ఇబ్బందులు పడాల్సి వచ్చేది. అ యితే రెండు రోజుల కిందట ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అమరచింతకు వెళ్తుండగా భూత్పూర్ వద్ద కెనాల్ నుం చి పెద్దఎత్తున నీళ్లు భూముల్లోకి వెళ్తుండడం గమనించారు. ఎమ్మెల్యే కారు దిగి దగ్గరకు వెళ్లి కెనాల్‌ను పరిశీలించారు. ఎగువ ప్రాంతం నుంచి భారీ వర్షాల వల్ల పెద్దఎత్తున నీళ్లు కెనాల్లోకి వెళ్లడంతో కాల్వకు గండిపడింది.
ఈమేరకు నీటి పారుదల శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. కెనాల్‌కు గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించి తక్షణమే మరమ్మతు పనులు చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. రెండు రోజులుగా కెనాల్ గండి పూడ్చివేత పనులు కొనసాగుతున్నాయి. గతేడాది కురిసిన భారీ వర్షాలకు మం డలంలోని గోలపల్లి, మంథన్‌గోడ్ వద్ద సంగంబండ రిజర్వాయర్ కెనాల్‌కు గండ్లు పడ్డాయి. అప్పట్లో ఎమ్మెల్యే ప్ర త్యేక చొరవ తీసుకొని దగ్గర ఉండి పనులు సకాలంలో పూ ర్తి చేయించి రైతులకు సాగునీటి కొరత రానివ్వకుండగా చ ర్యలు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం భూత్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కెనాల్‌కు గండి పడడంతో ఎమ్మెల్యే చి ట్టెం ప్రత్యేక చొరవ తీసుకోవడంపై పలు గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేశారు.
రైతులకు ఇబ్బందులు రానివ్వను
మక్తల్ నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టుల కింద రైతులకు సాగునీటి విషయంలో ఎటువంటి ఇ బ్బందులు రానివ్వను. మండలంలోని రాజీవ్ ఎత్తిపోతల ప థకంలో అంతర్భాగమైన చి ట్టెం నర్సిరెడ్డి (సంగంబండ) బ్యాలెన్సింగ్, భూత్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నుంచి లక్షా ఎకరాలకు సాగునీరు లభిస్తున్నది. భారీ వర్షాలు కురుస్తుండడంతో భూ త్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కెనాల్‌కు వరదనీటి ప్రవాహానికి గండిపడి తెగిపోయింది. తను స్వయంగా వెళ్లి చూశాను. రిజర్వాయర్‌కు ఇంకా నీటిని విడుదల చేయకముందే కాల్వ నుంచి వృథాగా నీరు వెళ్తుందని అనుకున్నాను. తీరా చూస్తే వరదనీటితో కాల్వకు గండిపడి తెగిపోయింది. రైతుల ఇబ్బందులను గమనించి ప్రాజెక్టుల కింద ఏ ఒక రైతు ఇబ్బందులు పడరాదనే ఉద్దేశంతో మరమ్మతు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడమైనది.
– చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే