మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, జూలై 11: పెరుగుతున్న జనా భా దృష్ట్యా ప్రతిఒక్కరూ కుటుంబ నియంత్రణ పాటించి జనాభా నియంత్రణకు సహకరించాలని వైద్యారోగ్యశాఖ జిల్లా అధికారి డాక్టర్ కృష్ణ అన్నారు. ప్రపంచ జనాభా నియంత్రణ దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. 1987 నుంచి ఏటా ఐక్యరాజ్యసమితి వారు ప్రపంచ జనాభా దినోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ఏటా కొత్త నినాదంతో ప్రజలందరినీ చైతన్యపర్చి జనాభాను అరికడుతున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం ‘కుటుంబ నియంత్రణ పాటించు.. ప్రగతికి నూతన అధ్యాయం లికించు’ అనే నినాదం తీసుకొచ్చారని, వైద్యశాఖలో పనిచేస్తున్న ప్రతి సిబ్బంది కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యపర్చి అమలు చేసేలా చూడాలన్నారు.
చైతన్యమైన దంపతులు ఒకే అమ్మాయికి కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వాణి, అదేవిధంగా తాత్కాలిక పద్ధతులైన పీపీఐయూసీడీ అంతరా ఇంజక్షన్ చేయించుకున్న షభానా, తశ్రీమాబేగంకు రూ.వెయ్యి ప్రోత్సాహకంగా పారితోషికం అందజేశారు. అదేవిధంగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేస్తున్న ఉత్తమ వైద్యులు డాక్టర్ భాస్కర్‌నాయక్, డాక్టర్ రఫీక్, ఉత్తమ వైద్యాధికారులుగా డాక్టర్ నరేశ్‌కుమార్, డాక్టర్ తులసీ, డాక్టర్ శ్వేత, స్టాఫ్‌నర్సులు సాలోని దీప్తి, శైలజ, సూపర్వైజర్లు శాంతమ్మ, యాదమ్మ, ఏఎన్ఎంలు చెన్నమ్మ, ఆనంద్బాయి, ఆశ కార్యకర్తలు రేణుక, నాగలక్ష్మికి అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ సరస్వతి, పీవో ఎంహెచ్ఎన్, డాక్టర్ భాస్కర్‌నాయక్, పీవో ఎన్సీడి డాక్టర్ సంధ్యాకిరణ్మయి, టీబీ నియంత్రణ జిల్లా అధికారి డాక్టర్ రఫీక్, డెమో అధికారి డాక్టర్ తిరుపతిరావు, ఎస్వో కృష్ణ, హెచ్‌ఈఈవో నర్సింహారెడ్డి, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
గండీడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో..
గండీడ్, జూలై 11: ప్రపంచ జనాభా నియంత్రణ దినోత్సవం సందర్భంగా సోమవారం మండలకేంద్రంలోని పీహెచ్సీలో వైద్యసిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యసిబ్బంది చిన్న కుటుం బం.. చింతలేని కుటుంబం, ఒక బిడ్డ ముద్దు రెండో బిడ్డ హద్దు, మేమిద్దరం.. మనకు ఇద్దరూ తదితర స్లోగాన్లతో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్యాధికారి రాములు, సూపర్వైజర్ అంబాదాసు, ఏఎన్ఎంలు అరుణ, పద్మజ, రేణుక, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.