మహబూబ్‌నగర్‌టౌన్, జూలై 10: సీఎం కేసీఆర్ సారథ్యంలో మతకలహాలు లేని రాష్ట్రంగా తెలంగాణ ఉంద ని ఆబ్కారీ, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జామి యా మసీదులో ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గం గా జమున తెహజీబ్ కలిసి పండుగలు జరుపుకొంటారని గుర్తుచేశారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గా లు సంతోషంగా జీవిస్తుంటే కొందరు ఓర్వలేక మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మం త్రి పేర్కొన్నారు. అధికారం కోసం ప్రజల మధ్య విద్వేషాలు తీసుకరావడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. మతం పేరిట కొందరు యువతను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్‌ఇసాక్, ఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ కేసీ న ర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్హ్రెమాన్, ముడా చైర్మన్ గంజివెంకన్న పాల్గొన్నారు.
మినీ ట్యాంక్‌బండ్ పనులు పూర్తిచేయాలి
మినీ ట్యాంక్‌బండ్ పనులు త్వరగా పూర్తిచేయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు, కేబుల్‌బ్రిడ్జి పనులను మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులుతో కలిసి పరిశీలించారు. వర్షం వల్ల ఏర్పడిన అంతరాయం తొలగిన వెంటనే పనులు చేట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి
వర్షపునీరు నిలువకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. మహబూబ్‌నగర్‌లోని లోతట్టు ప్రాంతాల్లో ఆదివారం ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంత్రి పర్యటించారు. జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్ష ప్రభావం జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీ సమీపంలో, గణేశ్హోటల్ సమీపంలో ఉన్న నాలాలను మంత్రి పరిశీలించారు. నాలాలో చెత్త తొలగించనందుకే వర్షపునీరు సరిగా ముందుకు వెళ్లడం లేదని, వెంటనే తొలగించాలని ఆదేశించారు. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలుపకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్‌చైర్మన్ తాటి గణేశ్ పాల్గొన్నారు.
వెంకన్న సన్నిధిలో మంత్రి దంపతులు
మహబూబ్‌నగర్‌రూరల్, జూలై 10: తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆదివారం జిల్లాకేంద్రంలోని పిల్లలమర్రి వేంకటేశ్వరస్వామిని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దంపతులు కుటుంబసమేతంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి ఆశీర్వాదంతో సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం పాడిపంటలతో సంతోషంగా ఉందని అన్నారు. అంతకుముందు మంత్రి దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం పట్టువస్ర్తాలతో సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్, కౌన్సిలర్ కిశోర్, సుదీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.