మహబూబ్నగర్ రూరల్, జూలై 10 : తొలి ఏకాదశి ప ర్వదినం సందర్భంగా ఆదివారం ఆలయాల్లో ప్రత్యేక పూజ లు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ప్రసిద్ధ ఆలయాలను వేకువజామునుంచే భక్తులు సందర్శించి పూజలు చేశారు. పేదల తిరుపతి మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆల యం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా గోవిందనామస్మరణతో ఆలయం మార్మోగింది. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
జడ్చర్ల మండలంలో..
జడ్చర్ల, జూలై 10 : తొలి ఏకాదశిని మండల ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా పలు ఆలయాలను భక్తులు తెల్లవారుజామునుంచే సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. తొలి ఏకాదశి సందర్భంగా కొందరు ఉపవాసదీక్ష పాటించారు. గంగాపూర్ లక్ష్మీచెన్నకేశవస్వామి ఆ లయంలో లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ని ర్వహించారు. జడ్చర్లలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆల యం, బాదేపల్లి పాతబజార్ పెద్దగుట్టపై కొ లువుదీరిన రంగనాయకస్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భం గా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే సత్యనారాయణస్వామి ఆలయం, సకలదేవతల ఆలయం, భాగేశ్వరాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి శుభాకాంక్షలు తెలిపా రు. ఏడాది పొడవునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారని, 15రోజులకు పండుగలు వస్తుంటాయన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో పర్వదినాలను జరుపుకోవాలని ఆకాంక్షించారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, జూలై 10 : తొలి ఏకాదశి సందర్భంగా మండలకేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూ జలు చేశారు. తెల్లవారుజామునుంచే భక్తులు ఆలయానికి చేరుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
శ్రీరామకొండలో ప్రత్యేక పూజలు
కోయిలకొండ, జూలై 10 : తొలి ఏకాదశి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీరామకొండలో ప్రత్యేక పూజలు చేశా రు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారికి గంధాభిషేకం, తులసీ అర్చన ,విష్ణు సహస్ర నామావళి పారాయణం కార్యక్రమాలు నిర్వహించారు.