నారాయణపేట రూరల్, జూన్ 28 : ఇంటర్ ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఇంటర్ మొదటి సంవత్సరం లో 4,131 మంది విద్యార్థులకుగానూ 2,210 మంది వి ద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 53.05 శాతం ఉత్తీర్ణత న మోదైంది. మొదటి సంవత్సరం ఒకేషనల్‌లో 662 మంది విద్యార్ధులకుగానూ 501 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యా రు. 75.68 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 3,753 మంది విద్యార్థులకుగానూ 2,148 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 57.23 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో ఒకేషనల్‌లో 640 మంది విద్యార్థులకుగానూ 487 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 76.09 శాతం ఉత్తీర్ణత శాతం న మోదైంది. ఆయా కళాశాలల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు అభినందించారు.
గురుకుల విద్యార్థుల ప్రతిభ
ఇంటర్ ఫలితాల్లో పేట గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చి మంచి ఉత్తీర్ణత శాతాన్ని సాధించారు. మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీలో 79 మంది విద్యార్థినులకుగానూ 75 మంది విద్యార్థినులు ఉత్తీర్ణులు కాగా నలుగురు అనుత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం ఎం పీసీ, బైపీసీలో 73 మంది విద్యార్థినులకు గానూ 68 మం ది విద్యార్థినులు ఉత్తీర్ణులు కాగా ఐదుగురు అనుత్తీర్ణులయ్యారు. ఒకేషనల్‌లో మొదటి సంవత్సరంలో 40 మంది విద్యార్థినులకుగానూ 40 మంది విద్యార్థినులు ఉత్తీర్ణులై వందశాతం ఉత్తీర్ణత సాధించగా, ద్వితీయ సంవత్సరం ఒకేషనల్‌లో 35 మంది విద్యార్థినులకుగానూ 35 మంది వి ద్యార్థినులు ఉత్తీర్ణులై వందశాతం ఉత్తీర్ణత సాధించారు. ఎం పీసీ మొదటి సంవత్సరంలో లహరి 470, బైపీసీలో భవా ని 440, ఒకేషనల్‌లో సంధ్య 500 మార్కులు సాధించి క ళాశాల టాపర్లుగా నిలిచారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బైపీసీ ఉర్దూ మీడియంలో ద్వితీయ సంవత్సరంలో సానియాబేగం 913 మార్కులు, ఎంపీసీలో మహే శ్ 890, హెచ్ఈసీలో నితీశ్ 845 మార్కులు సాధించి కళాశాల టాపర్లుగా నిలిచారు.
ప్రభంజనం
ఊట్కూర్, జూన్ 28 : ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఊ ట్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తాచాటారు. సెకండియర్ బైపీసీలో నందిని 941 మార్కులు, శ్రావణి 938 మార్కులు, ఎంపీసీలో జి.నాగేశ్వరి 858 మా ర్కులు, వంశీ 710 మార్కులు సాధించారు. సీఈసీలో భా ర్గవి 738 మార్కులు, నాగమ్మ 712, అఖి 697 మా ర్కు లు సాధించారు. ఫస్టియర్ బైపీసీలో తరుణ్ 423 మా ర్కు లు, ఎంపీసీలో కె.నందిని 418 మార్కులు, సీఈసీలో అఖి ల 427 మార్కులతో ప్రతిభచాటారు. సెకండియర్‌లో కళాశాలకు చెందిన 17 మంది విద్యార్థులు తెలుగు సబ్జెక్టు లో 99 సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రతాప్‌రెడ్డి తెలిపా రు. విద్యార్థులను అధ్యాపక బృందం అభినందించారు.
సత్తాచాటిన విద్యార్థులు
కోస్గి, జూన్ 28 : ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో గుండుమాల్ ఆదర్శ పాఠశాలలో ద్వితీయ సంవత్స రం ఎంపీసీ విభాగంలో కార్తీక్‌గౌడ్ 1000కుగానూ 953 మార్కులు సాధించగా బీపీసీ విభాగంలో అనిత 1000కుగానూ 947 సాధించగా మొదటి సంవత్సరం ఎంపీసీలో హజీరాబేగం 470కుగానూ 407 సాధించారు.
విద్యార్థుల సత్తా
ధన్వాడ, జూన్ 28 : ప్రభుత్వ జూనియర్ కళాశాల వి ద్యార్థులు మంగళవారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో స త్తాచాటారు. ధన్వాడ ప్రభుత్వ కళాశాలలో ద్వితీయ సంవత్సరం బైపీసీ విభాగంలో ధన్వాడ గ్రామానికి చెందిన చం ద్రశేఖర్ 902 మార్కులు సాధించగా మొదటి సంవత్సరం హెచ్ఈసీ విభాగంలో మహేశ్ 433 మార్కులు సాధించారు. విద్యార్థులు టాపర్లుగా నిలవడంపై తల్లిదండ్రులతో పాటు కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు.