మహబూబ్‌నగర్ రూరల్, జూన్ 27 : గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యతగా పనిచేయాలని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీపీ సుధాశ్రీ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాల్లో తాగునీరు, విద్యుత్ సమస్య ఏర్పడకుండా సంబంధిత అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు అన్ని గ్రామపంచాయతీల్లో క్రీడామైదానాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
త్వరలోనే కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అలాగే సొంత జా గలో ఇంటిని నిర్మించుకునే పేదలకు రూ.3లక్షల చొప్పున అందిస్తామన్నారు. అంతకుముందు పలువురు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో వైస్‌ఎంపీపీ అనిత, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మల్లు దేవేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, జెడీప కోఆప్షన్ సభ్యుడు అల్లావుద్దీన్, మండల కోఆప్షన్ సభ్యుడు మస్తాన్, తాసిల్దార్ పాండునాయక్, ఆర్ఐ నర్సింగ్‌నాయక్, ఎంపీడీవో వేదవతి, ఎంపీవో నరేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
క్రీడాకారులకు అభినందన
ఢిల్లీలో 18నుంచి 20వ తేదీవరకు నిర్వహించిన జాతీయస్థాయి యోగా టోర్నీలో ప్రతిభ చాటిన క్రీడాకారులు కవిత,లత, సాయి, కీర్తన, రాజేశ్వరిని సోమవారం జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించి మంచిపేరు తెచ్చుకోవాలని సూ చించారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ నటరాజ్, కోచ్ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.