మహబూబ్‌నగర్, జూన్ 27 : ‘మా బిడ్డ జీవితంలో స్థిరపడాలి.. మాకు చేయూతగా ఉండాలి’ అని ప్రతి ఒ క్కరి తల్లిదండ్రులు కోరుకుంటారని.. ఉద్యోగం చేసి వారికి అండగా నిలబడాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 1.30 ల క్షల ఉద్యోగాలు భర్తీ చేసిందని, మరో 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. 50 కంపెనీలతో చర్చలు జరిపామని, జూలై 3వ తేదీన జిల్లా కేంద్రంలోని జెడ్పీ మైదానంలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 7వ తరగతి, ఆపై చదివిన వారు అర్హులన్నారు. అందివచ్చిన ఉద్యోగాలను చేస్తూ ముందుకు సాగి.. కుటుంబానికి అండగా నిలబడాలన్నారు. డిగ్రీ, పీజీ, బీఈ, బీటెక్, బీఎస్సీ, బీకాం, బీ ఫార్మసీ, ఎం ఫా ర్మసీ, హోటల్ మేనేజ్‌మెంట్‌తోపాటు తదితర కోర్సులు చదివిన అభ్యర్థులు విద్యార్హత పత్రాలను తీసుకొని జా బ్మేళాకు రావాలన్నారు. ప్రైవేట్ కంపెనీలో ఇప్పటివరకు 15 లక్షల ఉద్యోగాలను ఇచ్చామన్నారు. ఈ జాబ్‌మేళాలో రూ.1.80 లక్షల ప్యాకేజీ నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుందన్నారు. జాబ్‌మేళాకు హాజరుకాలేని పరిస్థితిలో ఉన్న వారు https://forms.gle/aW H1uo5poS6RrT3D6 అనే లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ఉందన్నారు.
మహబూబ్‌నగర్‌కు ఎంతో భవిష్యత్తు..
ఎవరూ ఉహించని స్థాయిలో మహబూబ్‌నగర్ దశ దిశలా అభివృద్ధి చెందుతుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఐటీ పార్క్ ప్రధాన బిల్డింగ్ పూర్తి చేసేందుకు ఇటీవల రూ.9 కోట్లు విడుదల చేశామన్నారు. హన్వాడ మండలకేంద్రంలో 375 ఎకరాల్లో ఫుడ్‌పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కొందరు ఉద్దేశపూర్వకంగా అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. ప్రజలకు మంచి జరుగుతుంటే ప్రతిపక్ష నేతలు కంగారుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూత్పూర్-చించోలి రోడ్డుకు సంబంధించి టెండర్లు పూర్తయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. జాబ్‌మేళా తరువాత పోలేపల్లి సెజ్‌లో ఉన్న పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమై స్థానికులకు ఉద్యోగాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. భారత్‌మాల రహదారి విషయంలో కొంత మంది అడ్డుపడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, అదనపు కలెక్టర్ సీతారామారావు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శ్రీనివాసులు, ఆర్డీవో అనిల్‌కుమార్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహెమాన్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగ తపన ఉండాలి..
ఉద్యోగం సాధించాలనే తపన ఉంటే కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుందని, లక్ష్యాన్ని చేరుకుంటారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీసర్కిల్‌లో గ్రూప్-1, ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు స్టడీ మెటీరియల్, రూ.4 వేల స్కాలర్షిప్ను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ ఒకేసారి పెద్ద ఎత్తున ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేశారన్నారు. తల్లిదండ్రులను ఎట్టి పరిస్థితుల్లో మరువకూడదని, వారి కలలను నిజం చేసేందుకు ప్రతిక్షణం శ్రమించాలన్నారు. ఉచిత శిక్షణను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, కౌన్సిలర్ కిశోర్, బీసీ సంక్షేమాధికారి ఇందిర, బీసీ స్టడీ సర్కిల్ సంచాలకురాలు స్వప్న, సిబ్బంది రమాదేవి, మహేశ్‌కుమార్, రవీందర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందిస్తున్నామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. సోమవారం షాషాబ్‌గుట్ట ప్ర భుత్వ ఉన్నత పాఠశాలలో స్వామి వివేకానంద సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు 50 వేల నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిష్ణాతులైన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారన్నారు. నోట్ పుస్తకాలు పంపిణీ చేసిన స్వామి మునీశ్వర్ ఆనంద్జీని అభినందించారు. అంతకుముందు మధ్యాహ్న భోజనం సరిగ్గా పెడుతున్నారా.. గుడ్డు ఇస్తున్నారా.. భోజనం బాగుందా..? అని మంత్రి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో వి ద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో తరగతి గదుల కొరత ఉందని.. బీఈడీ కళాశాల గదులను కేటాయించాలని ఉపాధ్యాయులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే గదులు కేటాయించాలని మంత్రి అధికారుల ను ఆదేశించారు. కార్యక్రమంలో హెచ్ఎం సాయిబా బు, రెడ్‌క్రాస్ చైర్మన్ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థి విజయ్ కళ్లల్లో ఆనందం
మహబూబ్‌నగర్, జూన్ 27 : మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వి ద్యార్థి విజయ్‌కుమార్‌ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నిండు మనస్సుతో ఆశీర్వదించారు. ఫత్తేపూర్ మై సమ్మ ఆలయం వద్ద ‘నన్ను చదివించాలి’ అని మంత్రిని వేడుకున్న విద్యార్థి విజయ్ను రిషి పాఠశాలలో చేర్పించిన విషయం విధితమే. కాగా, సో మవారం ఉదయం విజయ్‌కు మంత్రి స్వయంగా పుస్తకాలు, దుస్తులు ఇప్పించి తన వాహనంలో క్యాంప్ కార్యాలయం నుంచి రిషి పాఠశాలకు పం పించారు. మంచిగా చదువుకోవాలని, ఎలాంటి ఇ బ్బందులు ఉన్నా నేనున్నాంటూ భరోసా ఇచ్చారు.