మహబూబ్‌నగర్‌టౌన్, జూన్ 18: వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్‌చైర్మన్ తాటిగణేశ్ అన్నారు. పట్టణప్రగతి ముగింపు కార్యక్రమంలో భాగంగా వార్డు కమిటీ సమావేశం నిర్వహించి మాట్లాడారు. పట్టణప్రగతి కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని, సోమవారం నుంచి దోమలపై సమరం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఇంట్లో చెత్త లేకుండా చూడాలని, ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామ్నరు. కార్యక్రమంలో కౌన్సిలర్లు అనంతరెడ్డి, ఆనంద్‌గౌడ్, యాదమ్మ, వనజ, రామాంజనేయులు, వార్డు అధికారులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ మండలంలో..
మహబూబ్‌నగర్ మండలంలోని దివిటిపల్లిలో శనివారం సర్పంచ్ జరీనాబేగం అధ్యక్షతన పల్లెప్రగతి ముగింపు సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి వైస్‌ఎంపీపీ అనిత హాజరై ప్రగతి పనులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ వద్ద దోమల నివారణ చర్యల్లో భాగంగా సర్పంచ్, వార్డుసభ్యులు, ఆశవర్కర్లతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఆశవర్కర్లు, ఆంగన్వాడీ టీచర్లు, వార్డుసభ్యులు, పంచాయతీ కార్యదర్శి వీరలింగం, పాల్గొన్నారు.
మహమ్మదాబాద్ మండలంలో..
మండలంలో చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం శనివారం గ్రామసభలు నిర్వహించి ముగించారు. గువ్వోనికుంటతండాలో ఎంపీవో శంకర్‌నాయక్ గ్రామసభకు హాజరై మాట్లాడారు. పల్లెప్రగతి విధులు నిర్వహించిన పారిశుధ్య సిబ్బందిని శాలువాలతో సన్మానించారు. గ్రామాల అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీవో కోరారు. కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
గ్రామాల్లో దోమల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని సర్పంచ్ శంకర్ అన్నారు. మండలంలోని పెద్దాయపల్లిలో శనివారం వైద్యసిబ్బంది ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేయించారు. అదేవిధంగా వాయిల్కుంటతండాలో సర్పంచ్ గోపీనాయక్, బోడగుట్టతండాలో సర్పంచ్ రమేశ్‌నాయక్, నేరళ్లపల్లిలో సర్పంచ్ ఖలీల్ గ్రామస్తులు, పారిశుధ్య కార్మికులతో ప్రతిజ్ఞ చేయించారు. అదేవిధంగా ఊటుకుంటతండాలో సర్పంచ్ లలితామంజూనాయక్ పారిశుధ్య కార్మికులకు నూతన దుస్తులు, పూలమాల, శాలువాతో సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో పంచాయతీ కార్యదర్శులు బాసురాథోడ్, అనిల్‌కుమార్, వినోద్‌కుమార్, నరేశ్, సింగిల్‌విండో డైరెక్టర్ మంజూనాయక్, వార్డుసభ్యులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
ప్లాస్టిక్ వాడకం బహిష్కరిస్తే పల్లెలు శుభ్రరంగా ఉంటాయని ఎంపీడీవో లక్ష్మీదేవి అన్నారు. పల్లెప్రగతి ముగింపు కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని తిర్మలాపూర్‌లో ప్లాస్టిక్ నిర్ములానపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పారిశుధ్య కార్మికులను, పంచాయతీ సిబ్బందిని సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ మహేశ్వరి, మాజీ సర్పంచ్ రామకృష్ణగౌడ్, పంచాయతీ కార్యదర్శి విద్యాసాగర్, పుల్లారెడ్డి, బాలయ్య, నర్సింహులు, చంద్రయ్య, విష్ణు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
గండీడ్ మండలంలో..
పల్లెప్రగతి కార్యక్రమంలో గ్రామాలు పట్టణాలను తలపిస్తున్నాయని జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఆశిరెడ్డిపల్లిలోని శనివారం నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. పల్లెప్రగతిలో గ్రామాలు శుభ్రంగా మారాయన్నారు. హరితహారంలో భాగంగా విరివిగా మొక్కలు నాటి సంరంక్షించాలన్నారు. పరిసరాల శుభ్రతతోనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని పెద్దవార్వల్ సర్పంచ్ లలిత అన్నారు. గ్రామస్తురాలు జిలేకాబేగంను గ్రామ పంచాయతీ తరఫున సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో ప్రత్యేక అధికారి మౌనిక, పంచాయతీ కార్యదర్శి హంస, సర్పంచ్ గోపాల్, పీఏసీసీఎస్ డైరెక్టర్ వెంకటయ్య, నాయకుడు భీమయ్య పాల్గొన్నారు.
హన్వాడ మండలంలో..
గ్రామాలు శుభ్రంగా ఉంచుకోవాలని ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు అన్నారు. పల్లెప్రగతి ముగింపు కార్యక్రమంలో భాగంగా గ్రామసభలు నిర్వహిం చి మాట్లాడారు. హరితహారంలో మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో సర్పంచులు, పం చాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.