కొల్లాపూర్, జూన్ 18 : కొల్లాపూర్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో మరింత అభివృద్ధి చేసి తీరుతామ ని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రా మారావు స్పష్టం చేశారు. అభివృద్ధి కులంగా.. సంక్షేమమే మతంగా.. ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని చెప్పారు. శనివారం కొల్లాపూర్ పట్టణంలో రూ. 170 కోట్ల వ్యయంతో చేపట్టేబోయే వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. అలాగే పీజీ కళాశాల వసతి గృహాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాలకు మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ రాములు, విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, కశిరెడ్డి నారాయణరెడ్డి, జెడ్పీచైర్పర్సన్లు హాజరయ్యారు. ఉదయం 11:05 గం టలకు హెలికాప్టర్లో మంత్రి కేటీఆర్ కొల్లాపూర్‌కు చేరుకున్నారు.
ఎమ్మెల్యే బీరం పూలమొక్క, బుద్ధుడి ప్ర తిమను అందించి స్వాగతం పలికారు. మొదటగా పట్టణంలో 5వ వార్డులో రూ.2.80 కోట్లతో సీసీ రోడ్లు, డ్రై న్ పనులకు, రూ.90 లక్షలతో అంబేద్కర్ చౌరస్తాలో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ నిర్మాణం పనులు, రూ.2.80 కోట్లతో కరెంట్ ఆఫీస్ వద్ద సీసీరోడ్లు, సైడ్ డ్రైన్ పనులు, రూ. 1.20 కోట్ల వ్యయంతో ఎన్టీఆర్ చౌరస్తా జంక్షన్ ఆధునీకరణ, బాబుజగ్జీవన్‌రాం చౌరస్తా నుంచి రూ.2 కోట్లతో రోడ్డు డివైడర్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు చేశారు. రూ.10 కోట్లతో నిర్మించిన పీజీ కాలే జీ ఉమెన్, మెన్ హాస్టల్ భ వనాలను ప్రారంభించారు. 20వ వార్డులో బండయ్యగుట్ట వద్ద రూ.2 కోట్లతో పా ర్కు ఆధునీకరణ పనులు, రూ.147 కోట్లతో సింగవట్నం నుంచి గోపల్‌దిన్నె రిజర్వాయర్‌కు గ్రావిటీ కెనా ల్ పనులకు పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం రాజా బంగ్లా ఎదుట ఎమ్మెల్యే బీరం అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. సోమశిల-సిద్దేశ్వరం మధ్య కృష్ణానదిపై బ్రిడ్జి కావాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మొండిపట్టుబట్టి సాధించుకున్నారని గుర్తు చే శారు. ఆయన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు చేసిన కృషిని మంత్రి అభినందించారు. సో మశిలతోపాటు అమరగిరిని పర్యాటకంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కొల్లాపూర్‌కు డయాలసిస్, డయాగ్నొస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
ప్రపంచ స్థాయిలో మంత్రి కేటీఆర్‌కు పేరు : ఎంపీ రాములు
దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే పే రు ప్రతిష్టలు తెచ్చుకున్న మంత్రి కేటీఆర్ అని ఎంపీ రాములు అ న్నారు. ఈ రోజు కొల్లాపూర్‌కు శుభదినం.. గోపల్‌దిన్నె రిజర్వాయర్‌కు గ్రావిటీ కాల్వ నుంచి సాగునీటిని అం దించే చర్యలు చేపట్టడం ఎమ్మెల్యే బీరం గొప్పతనమన్నారు. ఈ పనులు పూర్తయితే కొల్లాపూర్ తాలూకా వ్యవసాయపరంగా అభివృద్ధికి ఎంతో దోహదపడనున్నదని చెప్పారు. కల్వకుర్తి నుంచి కొల్లాపూర్, నంద్యాల వరకు రూ.1200 కోట్లతో హైవే రోడ్డు, సోమశిల బ్రిడ్జి పూర్తయితే ప్రపంచంలోనే ఐకాన్‌గా ప్రఖ్యాతలు పొందుతుందని చెప్పారు. దీంతో ఈ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందడంతోపాటు నిరుద్యోగులు ఎందరో ఉపాధి పొందనున్నారని పేర్కొన్నారు.
సాగునీటి రంగంపై దృష్టి : విప్ గువ్వల బాలరాజు
ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని విప్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టులతోపాటు ఇతర అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ కృషి ఎంతో ఉందన్నారు. సీఎం నాయకత్వంలో ఎమ్మెల్యేలకు ఎం తో స్వేచ్ఛ ఉందన్నారు. కార్యక్రమాల్లో మాజీ ఎంపీ మంద జగన్నాథం, జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, చైర్పర్సన్లు సరిత, పద్మావతి, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, డీసీసీబీ డైరెక్టర్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్, జేసీ మనూచౌదరి ఉన్నారు.