మరికల్, జూన్ 18 : ప్రపంచంలో ఎక్కడా లేని విధం గా తెలంగాణలో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవే శపెట్టారని, దళితుల జీవితాల్లో వెలుగులు నింపి, వారు ఆర్థిక స్వావలంబనలో అభివృద్ధి చెందడం కోసం దళితబం ధు పథకం అమలు చేయడం జరిగిందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ధన్వాడ, మరికల్ మండలాలలకు చెందిన దళి త కుటుంబాలకు శనివారం రైతు వేదిక వద్ద దళితబంధు పథకంలో ట్రాక్టర్లు, బుల్డోజర్లను పంపిణీ చేసి మాట్లాడా రు. దళితబంధు పథకంలో ప్రతి లబ్ధిదారుడికి రూ.9లక్షల 90వేలతో ట్రాక్టర్లు, బుల్డోజర్ వాహనాలను పంపిణీ చేశా మన్నారు. జిల్లాలో దళితబంధు పథకంలో అధికారులు అ వినితీకి పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నా రు. లబ్ధిదారులు ఎవరైనా అధికారులకు డబ్బులు ఇచ్చిన ట్లు తెలిస్తే లబ్ధిదారుడికి ఇచ్చిన వాహనాన్ని కలెక్టర్ కార్యాలయంలో ఉంచుతామన్నారు.
అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం
జిల్లాలో ఎస్సీలకు మంజూరైన రుణాల జాబితా ఇవ్వాలని ఎమ్మెల్యే కోరగా ఎస్సీ కార్యాలయాధికారి హరినాథ్ రెడ్డి కలెక్టర్ అనుమతితో జాబితా ఇస్తామనడంతో ఎమ్మెల్యే ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారుల జాబితా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అధికారులు టైంపాస్‌కు వస్తున్నారని, టైంపాస్‌కు వచ్చే అధికారులు తమకు అవసరం లేదన్నారు. ప్రజలకు సేవ చేసే అధికారులు ఇక్క డ ఉద్యోగం చేయాలన్నారు. అధికారులు అడిగిన సమాచా రం ఎందుకు ఇవ్వడం లేదని చరవాణిలో కలెక్టర్ హరిచందనను అడిగారు. కలెక్టర్ అధికారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితబంధు పథకంలో అధికారులు అవినీతికి పా ల్పడితే సహించేది లేదన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి, వైస్ ఎంపీపీ రవికుమార్, స ర్పంచులు గోవర్ధన్, శ్రీనివాస్ రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు సంపత్‌కుమార్, తీలేరు పీఏసీసీఎస్ చై ర్మన్ రాజేందర్‌రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యడు మతీన్, జి ల్లా కోఆప్షన్ సభ్యడు వాహిద్, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
పనులు పూర్తి చేయాలి
పట్టణంలో చేపడుతున్న వయోవృద్ధుల ఉద్యానవనం పనులను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. శనివా రం సత్యసాయి కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న వయో వృద్ధుల ఉద్యానవనం(సీనియర్ సిటిజన్ పార్క్) పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పనులు త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ జగదీశ్, ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు విజయ్‌సాగర్, ప్రధానకార్యదర్శి చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.