కోస్గి, జూన్ 18 : గ్రామగ్రామాన క్రీడా ప్రాంగణాలు ఏ ర్పాటు చేసి పట్టణ, పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. పట్టణంలో శనివా రం అదనపు కలెక్టర్ చంద్రారెడ్డితో కలిసి క్రీడా ప్రాంగణం, సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్ర భుత్వ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయ ని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు క్రీడల్లో రా ణించాలన్నారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వం క్రీడా ప్రాంగ ణాలను ఏర్పాటు చేస్తుందన్నారు. పాఠశాల విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే వాలీబాల్, ఖోఖో కాసేపు ఆడారు. అంతకుముందు బల్దియాలోని 16వ వార్డులో సీసీ రోడ్డు నిర్మా ణ పనులు, సమీకృత మార్కెట్ పనులను ప్రారంభించారు. అక్కడే పట్టణ యువకుల కోసం షటిల్ కోట్ ఏర్పాటు చే యాలని అధికారులను ఆదేశించారు. మండలంలోని ముక్తిపాడ్లో ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు అందజేస్తున్న కంది విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయా ల సంస్థ జిల్లా చైర్మన్ రామకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ శిరీ ష, జెడ్పీటీసీ ప్రకాశ్‌రెడ్డి, ఎంపీపీ మధుకర్‌రావు, డీసీసీబీ డైరెక్టర్ భీంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్, మార్కె ట్ కమిటీ వై స్‌చైర్మన్ వరప్రసాద్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రాజేశ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
హరితహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
హరితహారం కార్యక్రమంపై ప్ర జాప్రతినిధులు, గ్రామ స్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధ వ హించాలని కలెక్టర్ హరిచందన సూచించారు. పల్లె ప్రగతి లో భాగంగా శనివారం మండలంలోని తిమ్మారెడ్డిపల్లి తం డాను సందర్శించి నర్సరీని పరిశీలించారు. జీవామృతంతో మొక్కల ఎదుగుదలకు చర్యలు చేపట్టాలని ఉపాధి సిబ్బందిని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శి తాజుద్దీన్ విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టి కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని డీపీవో మురళిని ఆదేశించారు. గ్రామాల అ భివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఉండాలని కోరారు. కార్యక్రమంలో పీడీ వేణుగోపాల్, ఏపీడీ సందీప్‌కుమార్, ఈసీ శ్రీనివాసులు, పెద్దజట్రం పంచాయతీ కార్యదర్శి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పట్టణాలకు దీటుగా పల్లెలు అభివృద్ధి
పట్టణాలకు దీటు గా పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని కలెక్టర్ హరిచందన అన్నారు. మండలంలోని జాజాపూర్‌లో పల్లె ప్రగతి కార్యక్రమం శనివారంతో ముగిసింది. క్రీడా ప్రాంగణం, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. విద్యార్థులతో ఏబీసీడీలు, 1, 2, 3లు చదివించారు. అంగన్వాడీ కేంద్రంలో పంచాయతీ నిధులతో ఫైన్ ట్యూబ్లైట్లను వేయించాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రంలో మధ్యాహ్న భోజనానికి సం బంధించిన ఏర్పాట్లు పరిశీలించి గ్యాస్ సిలిండర్‌పై వంట వండాలని నిర్వాహకులకు సూచించారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా గ్రామంలో చాలా పనులను చేపట్టుకోవచ్చన్నారు. అలాగే పాఠశాలకు ప్రహరీ నిర్మించుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో గోపాల్‌నాయక్, డీపీవో మురళి, ఎం పీడీవో సందీప్‌కుమార్, సర్పంచ్ కోట్ల సుగంధమ్మ, ఎంపీ టీసీ శేఖర్, కార్యదర్శి శ్రీనివాసులు పాల్గొన్నారు.
పట్టణ ప్రగతితో అభివృద్ధి
పట్టణ ప్రగతి కార్యక్రమంతో వార్డుల్లో అనేక అభివృద్ధి పనులు చేసినట్లు ము న్సిపల్ చైర్పర్సన్ అనసూయ, 13వ వార్డు కౌన్సిలర్ నారాయణమ్మ, 23వ వార్డు కౌన్సిలర్ తఖీచాంద్ అన్నారు. పట్ట ణ ప్రగతి ముగింపులో భాగంగా వార్డుల్లో చేపట్టిన పనుల ను వారు పరిశీలించారు. ఇప్పటి వరకు వార్డుల్లో ముళ్లపొదల తొలగింపు, శిథిలావస్థకు చేరిన ఇల్లు కూల్చివేత, హరితహారంలో మొక్కలు నాటడం, వీధి దీపాలను ఏర్పాటు చేయడం, పాతవాటి స్థానంలో కొత్త విద్యుత్ స్తుంభాలు ఏర్పాటు చేయడం, తాగునీటి పైప్లైన్లకు మరమ్మతులు చేపట్టడం, రోడ్లకు ఇరువైపులా ముళ్ల కంపను తొలగించ డం, మురుగు కాలువలు, డ్రైనేజీలు శుభ్రం చేయడం తదితర పనులను చేయడం జరిగిందన్నారు. పట్టణ ప్రగతిలో చేపట్టే కార్యక్రమాల్లో వానకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చన్నారు. అనంతరం పట్టణ ప్రగతిలో సేవ లు అందించిన ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, వార్డు అధికారులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా పట్టణంలోని 2వ వార్డులో కౌన్సిలర్ అనిత, టీఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సుభాష్ ఆధ్వర్యంలో వార్డులో చే పడుతున్న పనులను పరిశీలించారు. మొక్కలు నాటి సేవ లు అందించిన సిబ్బందిని సన్మానించారు. 3వ వార్డులో కౌన్సిలర్ సత్యరఘుపాల్ పట్టణ ప్రగతి ప్రత్యేకాధికారి స్వ ప్న, పారిశుధ్య సిబ్బందిని సన్మానించారు. 8వ వార్డులో కౌన్సిలర్ శిరీష సిబ్బందితో పారిశుధ్య పనులు చేయించడంతోపాటు హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయించారు. అదేవిధంగా 11, 4, 7, 3, 13, 14వ వార్డుల్లో చేపడుతు న్న పనులను కౌన్సిలర్లు, ప్రత్యేకాధికారులు పరిశీలించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అమీరుద్దీన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
‘ప్రగతి’ విజయవంతం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో విజయవంతమైనట్లు జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ తెలిపారు. పట్టణంలోని జెడ్పీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పల్లె ప్రగతితో గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, పచ్చదనం, పరిశుభ్రతతోపాటు మౌలిక సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ అందించిన స్ఫూర్తితో నిరంతరం గ్రా మాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. పల్లెప్రగతి కార్యక్ర మం విజయవంతానికి కృషి చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
దామరగిద్ద మండలంలో…
దామరగిద్ద, జూన్ 18 : మండలంలోని ముస్తాపేటలో పల్లె ప్రగతి ముగింపు పనులను మండల ప్రత్యేకాధికారి వెంకట్రాములు శనివారం పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న పనులను పరిశీలించి ఇంటింటికీ తిరుగుతూ చెత్త ను బుట్లలో వేసి ట్రాక్టర్లో వేయాలన్నారు. ఇంటి నుంచి వెలువడే మురుగు నీటిని డ్రైనేజీలకు వెళ్లే విధంగా చూడాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, గ్రామం పరిశుభ్రంగా ఉండేటట్లు చూసే బాధ్యత ప్రతిఒక్కరూ తీసుకోవాలని అవగాహన కల్పించారు. అనంతరం ముగింపు సభ నిర్వహించి ప్రతిరోజూ చేయాల్సిన కార్యక్రమాలపై చ ర్చించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లాలప్ప, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
నర్వ మండలంలో…
మండలంలోని అన్ని గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు శనివారం జోరుగా కొనసాగాయి. పురాతన గృహాల కూల్చివేత, పాడుబడిన బావులను పూడ్చడం, ము ళ్లపొదలు, కంపచెట్లను తొలగించడం, క్రీడా ప్రాంగాణాలు ఏర్పాటు, డ్రైనేజీ కాలువలను శుభ్రపర్చడం తదితర పనులను నిర్వహించారు. పలు గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభలకు ఎంపీడీవో రమేశ్‌కుమార్ హాజరై ప్రజలతో చర్చించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, కార్యదర్శులు, ప్రజలు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులపై గ్రామసభలు
మండలంలోని అన్ని గ్రామా ల్లో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం శనివారంతో ముగిసిం ది. పల్లె ప్రగతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కార్యక్రమంతో గ్రామాలు పరిశుభ్రంగా మారా యి. రోడ్లకు ఇరువైపులా ముళ్లచెట్లు, పిచ్చి చెట్లు తొలగించడం, మురుగుకాలువలు శుభ్రం చేయడం, చెత్తాచెదారం తీసివేయడంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. పల్లె ప్రగతి ముగింపు సందర్భంగా అన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచుల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు. గ్రామ సభల్లో పల్లె ప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనులపై గ్రామస్తులకు వివరించడం జరిగింది. పల్లె ప్రగతిలో మిగిలిపోయిన పనులను త్వరగా పూర్తి చేయడం జరుగుతుంద ని ప్రజాప్రతినిధులు, అధికారులు తెలిపారు. మండలకేంద్రంతోపాటు కొత్తపల్లి, నింగంపల్లి, తాళంకేరి. నేరడగందో డ్డి, నేరడగం, ఉజ్జల్లి, బైరంపల్లి, వడ్వాట్, అమ్మపల్లి, అడవి సత్యరం, కోల్పుర్, మందిపల్లి ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచులు, ఉపస ర్పంచులు, వార్డు మెంబర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.