ఖిల్లాఘణపురం, జూన్ 16 : క్రీడాకారుల్లో ప్రతిభ ఉన్నా క్రీడా ప్రాంగణాలు లేక వెనుకడుగు వేస్తున్నారనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆలోచనతో ప్రతి గ్రామానికి క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టారని, ఈ క్రీడా మైదానాలు కొత్త తరాలకు ప్రోత్సాహాన్నిచ్చేలా రూపుదిద్దుకుంటాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలంలోని కర్నెతండాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడా మైదానాన్ని కలెక్టర్ షేక్‌యాస్మిన్ బాషా, జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో చదువుపై ఆసక్తి పెరిగి చురుకుదనం పెంపొందుతుందన్నారు. రాష్ట్రంలో వనపర్తి ని యోజకవర్గంలోనే ఎక్కువ క్రీడా మైదానాలను ఏర్పా టు చేస్తామన్నారు. అనంతరం క్రీడా మైదానంలో పోటీలను ప్రారంభించి కాసేపు వాలీబాల్ ఆడి క్రీడాకారుల ను ఉత్సాహపర్చారు. కర్నెతండా సమీపంలో కొనసాగుతున్న కర్నెతండా లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పరిశీలించి వెళ్లారు. కార్యక్రమంలో ఎంపీపీ కృష్ణానాయక్, మా ర్కెట్ కమిటీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు కృష్ణయ్య, జెడ్పీటీసీ సామ్యానాయక్ ఉన్నారు.