భూత్పూర్, జూన్ 16 : రాష్ట్రంలోని పట్టణాలను సుందరీకరణ చేయాలనే ఉద్దేశంతోనే పట్టణ ప్రగతి కా ర్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం మున్సిపాలి టీ పరిధిలోని 10వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణాల్లో పారిశుధ్యం లోపించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాత ఇండ్లు, పాడుబడిన బావులు, పాతబోరు గుంతలు లేకుండా మున్సిపాలిటీ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 4వ విడుతలో పారిశుధ్యంపై దృష్టి సారించినట్లు తెలిపారు.
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలైన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వైకుంఠధామాల పనులను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. పనులు త్వరగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, కమిషనర్ నూరుల్ నజీబ్, మేనేజర్ అశోక్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మాజీ సర్పంచ్ మృతికి ఎమ్మెల్యే విచారం
మూసాపేట, జూన్ 16 : మండలంలోని జానంపేట మాజీ సర్పంచ్ బండ జంగిరెడ్డి(90) అనారోగ్యంతో బుధవారం రాత్రి మృతి చెందాడు. గురువారం విష యం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆల మృతదేహానికి నివాళులర్పించారు. ఆయన మృతి పార్టీకి తీరనిలోటన్నారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.