ఆత్మకూరు, జూన్ 16 : ఆత్మకూరు లో ‘సురాపానం’ చిత్ర బృందం సందడి చేసింది. చిన్నచింతకుంట మండలానికి చెందిన కళాకారులు నటించిన ‘సురాపా నం’ సినిమా ఆత్మకూరు హైటెక్ డీలక్స్ థియేటర్లో విడుదలైంది. కాగా, గురువారం చిత్ర యూనిట్ థియేటర్‌ను సం దర్శించింది. చిన్నచింతకుంటకు చెందిన సంపత్‌కుమార్ ఈ చిత్రంలో హీరోగా నటించి దర్శకత్వం వహించాడు. అఖిల భవ్య క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రానికి మట్టా మధుయాదవ్ నిర్మాతగా వ్యవహరించాడు. మహబూబ్‌నగర్ జెడ్పీ చై ర్‌పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డితో కలిసి చిత్ర బృందం సినిమాను వీక్షించింది.
అనంతరం విలేకరుల సమావేశంలో సంపత్‌కుమార్ మాట్లాడుతూ మొదటి ప్రయత్నంగా చేసిన సినిమాను విజయవంతం చేయాలని కోరారు. హీరోయిన్ ప్రజ్ఞానయన్కు మంచి భవిష్యత్ ఉందన్నారు. సహనటులు అజయ్‌ఘోష్, సూర్య, చ మ్మక్ చంద్ర, ఫిష్ వెంకట్, లక్ష్మణ్ మీ సాల, సురభి ప్రభావతి, జెన్ని, కోటేశ్వర్రావు తదితరులు అద్భుతంగా నటించారన్నారు. డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ వి జయ్ ఠాగూర్, సంగీతం భీమ్స్ సెసిరె ల్లో, ఎడిటింగ్ జేపీ, డైలాగ్స్ రాజేంద్ర ప్రసాద్ చిరుత వ్యవహరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో థియేటర్ సూపర్వైజర్ శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు.