మహబూబ్‌నగర్, జూన్ 16 : జిల్లా కేంద్రంలోని ట్రెండ్ హుందాయ్ కారు షోరూంలో వెన్యూ నూతన కారును గురువారం సీఈవో అడ్మినిస్ట్రేష న్ గట్టు సరిచందనారెడ్డి, మార్కెటింగ్ సీఈవో గట్టు శ్రీహర్షిత్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుందాయ్ వినియోగదారుల కోసం నూతన డిజైన్‌తో ఆకర్షణీయమైన కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టినట్లు తెలిపారు. 1.2 లీటర్ పెట్రోల్, 1 లీటర్ టర్బో, 1.0 టర్బో, 1.5 సీఆర్డీఐ ఇంజిన్లలో వినియోగదారులకు అందుబాటులో ఉందన్నారు. పె ట్రోల్ వెర్షన్లో లభించే ఈ కారు 20.5 కి.మీ. మైలేజీ లభిస్తుందని పేర్కొన్నారు. డీజిల్ వెర్షన్లో 22.3 కి.మీ. మైలేజ్ ఇస్తుందని, 60కిపైగా ప్రత్యేక ఫీచర్స్ కలిగి ఉంటుందన్నారు. ప్రారంభ ధర రూ.7.53 లక్షల నుంచి రూ. 12.47 లక్షల ఎక్స్‌షోరూం ధరలో అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో సేల్స్ మేనేజర్ హర్షవర్ధన్‌రెడ్డి, సర్వీస్ మేనేజర్ వాషిమ్ ఉన్నారు.