మాగనూర్, జూన్ 16 : సర్కార్ బడుల్లో త మ పిల్లలను చేర్పించి, ప్రభుత్వం అందించే ఉ చిత సదుపాయాలతోపాటు ఆర్థిక భారం తగ్గించుకోవాలని మండల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు నర్సింహులు అన్నారు. మండలకేంద్రంలో ఉపాధ్యాయులతో కలిసి ఆయన బడిబాట కార్యక్రమం గురువారం నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రభుత్వ పాఠశాల అవశ్యకతను వివరించారు. ఈఏడాది నుంచి ప్రభుత్వం పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రా రంభించిందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ను ప్రభుత్వ పాఠశాలలకే పంపాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
పాఠశాల తనిఖీ
దామరగిద్ద, జూన్ 16 : మండలంలోని ఉల్లిగుం డం పాఠశాలను మండల విద్యాధికారి వెంకటయ్య తనిఖీ చేశారు. ‘మన ఊరు-మన బడి’ పనులను గు రువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంగ్ల మాధ్యమం కోసం విద్యార్థుల ను పాఠశాలలో చేర్పించుకోవాలని ఉపాధ్యాయుల కు సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో కానుకుర్తి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విశ్వనాథ్, ఎంపీటీసీ కిషన్‌రావు, సర్పంచ్ కృష్టారెడ్డి, గ్రామ యువకులు తదిత రులు పాల్గొన్నారు.
ప్రవేశాలు
నర్వ, జూన్ 16 : మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నూతన ప్రవేశాలు అధికంగా కొనసాగుతున్నాయని ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్, ఉస్మాన్, మల్లేశ్ తెలిపారు. ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పన, నా ణ్యమైన భోజనం అందజేత, ఆంగ్ల విద్యాబోధించడం తదితర అంశాలపై ప్రవేశాలు ఎ క్కువ జరుగుతున్నాయని వారు తెలిపారు. అలాగే బడిబాట కార్యక్రమంతో ఇంటింటికీ తిరుగుతూ బడి బయటి పిల్లలను పాఠశాలలకు వచ్చేలా తల్లిదండ్రులకు అవగాహన క ల్పించామని వారు తెలిపారు.