మహబూబ్‌నగర్‌టౌన్, జూన్ 16 : ప్రతిఒక్కరూ చల్లని పదార్థాలే ఇష్టపడుతుంటారు. చిన్నపిల్లలు మొదలు పెద్దల వరకు ఐస్క్రీంకే ప్రాధాన్యత ఇస్తారు. ఈ తరుణంలో మహబూబ్‌నగర్‌లో ఏండ్ల తరబడి షాలీమార్ ఐస్‌క్రీమ్ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నది. వివిధ కంపెనీలకు ఏ మాత్రం తీసిపోకుండా మహబూబ్‌నగర్ బ్రాండ్ ఇమేజ్ను షాలీమార్ ఐస్‌క్రీమ్ మరింత విస్తృతం చేస్తున్నది. 12 ఏండ్లుగా ఉమ్మడి జిల్లాలోని పలు ప్రధాన పట్టణాలతోపాటు రాయిచూర్, కర్నూలు, హైదరాబాద్ ప్రాంతాల్లోనూ షాలీమార్ ఐస్‌క్రీమ్‌కు వినియోగదారులు అత్యధికంగా ఉన్నా రు. వినియోగదారుల ఇష్టం మేరకు షాలీమార్ ఐస్‌క్రీమ్ తక్కువ ధరల్లో, నాణ్యవంతం గా విక్రయిస్తున్నారు. రూ.6 నుంచి రూ.500వరకు ఐస్క్రీ మ్స్ వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.
షాలీమార్ పట్నంలోనూ హవా
మహబూబ్‌నగర్‌లో తయారవుతున్న షాలీమార్ ఐస్‌క్రీమ్ కు హైదరాబాద్‌లోనూ మంచి ప్రాధాన్యత ఉంది. తక్కువ ధర లో నాణ్యవంతంగా అందించడంతో వినియోగదారులు అత్యధికంగా కొనుగోలు చేస్తున్నారు. షాలీమార్‌లో కోల్డ్స్టోన్, డ్రైప్రూ ట్స్, తిక్షేక్, మిల్క్‌షేక్, సింగి ల్ సండే, డబుల్సండే, త్రి బుల్సండే, బ్లాక్‌ఫారెస్ట్, చాకోబార్, మ్యాగోడ్యూ ట్, రాజ్బేరి, చాక్లెట్కోన్, బటర్‌స్కాచ్ కోన్, డబుల్ చాక్లెట్కోన్తోపాటు వివిధ రకాల ఐస్‌క్రీమ్స్, కేక్‌లను తయా రు చేసి బడా కంపెనీలకు ఏ మాత్రం తీసిపోకుండా అతిపె ద్ద కంపెనీగా షాలీమార్ ఐస్‌క్రీమ్ ప్రగతి సాధిస్తున్నది.
మరింత విస్తరించాలన్నదే నా కల
పన్నెండేండ్ల కిందట షాలీమార్ ఐస్‌క్రీమ్‌ను తయారు చేస్తున్నాం. ప్రారంభించినప్పటి నుంచి నాణ్యవంతంగా, అందరికీ అందుబాటులో ధరలు, నాణ్యతలో రాజీ లేకుండా అందిస్తున్నాం. మహబూబ్‌నగర్ షాలీమార్ కంపెనీ తయారు చేసిన ఐస్‌క్రీమ్స్‌కు హైదరాబాద్‌లో మంచి డిమాండ్ ఉన్నది. సరిహద్దు రాష్ర్టాల్లోనూ ఐస్‌క్రీమ్ బ్రాంచీలను ఏర్పాటు చేస్తున్నాం. వినియోగదారులకు అవసరమైన రకరకాల్లో ఐస్‌క్రీమ్స్ అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాం.
-సయ్యద్ జమీల్, మేనేజింగ్ డైరెక్టర్, షాలీమార్ ఐస్‌క్రీమ్