నారాయణపేట టౌన్, జూన్ 16 : వయోవృద్ధులను వేధింపులకు గురి చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరిచందన అన్నా రు. ప్రపంచ వయోవృద్ధుల వేధింపులపై అవగాహన దినోత్సవం సందర్భంగా గురువారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయ ఆవరణలో వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వయో వృద్ధులను వేధింపులకు గురిచేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. వయోవృద్ధులు నిర్లక్ష్యానికి గురైనా, మానసిక, శారీరక, ఆర్థిక, లైంగిక వేధింపులకు గు రైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్ర త్యేక టోల్ ఫ్రీ నెంబర్ 14567కు కాల్ చేసి సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, ఫీల్డ్ రెస్పా న్స్ ఆఫీసర్ సాయి, డీసీపీవో కుసుమలత, పీవో ఐసీ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
గౌరవించాలి
నారాయణపేట, జూన్ 16 : వయోవృద్ధులను ప్రతిఒక్కరూ గౌరవించాలని ఎస్పీ వెంకటేశ్వర్లు అ న్నారు. గురువారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వయోవృద్ధులను వేధిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సఖీ సెంటర్ ఇన్చార్జి వెం కటమ్మ, సాయి పాల్గొన్నారు.