దేవరకద్ర రూరల్, జూన్ 13 : రాష్ర్టాభివృద్ధ్ది, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానం లో ఉందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. చిన్నచింతకుంట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు సోమవారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముం దుగా చిన్నచింతకుంట మండలంలోని అమ్మాపూర్ గ్రామ స మీపంలో కురుమూర్తి స్వామి ఆలయ ప్రాంగణంలో దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన గోశాలను జెడ్పీ చైర్పర్స న్ స్వర్ణసుధాకర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పూజలు చేసి ప్రారంభించారు.
అల్లీపూర్ గ్రామ పార్టీ నాయకుడు రంజిత్‌గౌడ్ తండ్రి, ఉప్పరి బాలరాజు తల్లి ఇటీవల అనారోగ్యతో మృతి చెందిన విషయం ఎమ్మెల్యేకు తెలిసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదే గ్రామంలో పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థులు ఎంత మంది ఉన్నారని తెలుసుకున్నారు. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. మద్దూర్‌లో నూతనంగా పోచమ్మ విగ్రహం, బొడ్రాయి ప్రతిష్ఠ పూజల్లో పా ల్గొన్నారు. చింతకుంట మండలకేంద్రంలో గ్రామీణ క్రీడా ప్రాంగణం ప్రా రంభించి, క్రీడాకారులతో వాలీబాల్ ఆడారు.
గూడూరు గ్రామానికి చెందిన కురుమూరికి దళితబంధు మంజూరైన సందర్భంగా చింతకుంటలో ఏవీఆర్ మొబైల్ షా ప్ను ప్రారంభించారు. సీతారాంపేట నెల్లికొండి గ్రామాల మ ధ్య ఉన్న మన్నె వాగుపై రూ.1కోటి 70 లక్షల నిధులతో బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టాభి వృద్ధే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు. దేశంలో రైతులు, ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందింస్తున్నది కేవలం తెలంగాణ ప్రభుత్వమే అని పేర్కొన్నారు.
సం క్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో అమలవుతున్నాయో చూ పాలని ప్రతిపక్ష నాయకులను ప్రశ్నించారు. 70 ఏండ్లు పాలించిన ప్రభుత్వాలు ఏమేమి చేశాయో చూపాలన్నారు. 8 ఏండ్ల లో అభివృద్ధి చేసి చూపించామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వరి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోట రాము, సర్పంచ్ మహ్మద్ గౌస్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కరుణాకర్‌రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ సురేందర్‌రెడ్డి, ఎంపీటీసీ శ్రీదేవి, సీసీకుంట సర్పంచ్ మోహన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.