భూత్పూర్, జూన్ 13 : గ్రామాల్లోని యువకులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని అదనపు కలెక్టర్ తేజస్‌నందలాల్ కోరా రు. మండలంలోని కొత్తూర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలనే ఉ ద్దేశంతో ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలను ఏర్పా టు చేస్తున్నట్లు తెలిపారు. యువకులు వ్యాయా మం చేసేందుకు, రోజూ ఆటలు ఆడేందుకు వీ లుగా క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసిందన్నారు. గ్రామస్తులంతా దీన్ని అందంగా ఉంచుకోవాలని ఆయ న విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శేఖర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్‌గౌడ్, ఎంపీడీవో మున్ని, ఎంపీవో విజయకుమార్, సర్పంచ్ యాదయ్య, కార్యదర్శి గఫార్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులపై దృష్టి సారించాలి
మహబూబ్‌నగర్ టౌన్, జూన్ 13 : అభివృద్ధి పనులపై దృష్టి సారించాలనిఅదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ అన్నారు. పురపాలిక శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై మున్సిపల్ శాఖ అధికారుల తో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని, అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. నాణ్యత లేకుండా పనులు చేస్తే చర్యలు తీసుకోవాలన్నారు. స మావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, ఎం ఈ సుబ్రమణ్య, డీఈలు బెంజిమెన్, సూర్యనారాయ ణ, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.