వనపర్తి రూరల్, జూన్ 13 : వనపర్తి మండలంలోని కిష్టగిరి, పెద్దగూడెంతండా, పెద్దగూడెం గ్రామాలకు సాగునీరందించేందుకు సీఎం కేసీఆర్‌ను ఒప్పించి నిధులు తీసుకొస్తానని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. సోమవారం వనపర్తి మండలంలోని కిష్టగిరి గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. కిష్టగిరి గ్రామానికి సాగునీరు తీసుకొచ్చేందుకు రూ.18 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ముఖ్యమంత్రికి పంపామన్నారు.
సీఎం కేసీఆర్ ఆ ఫైల్‌పై సంతకం చేసి రెండు, మూడు రోజుల్లో జీవో విడుదల చేస్తారని చెప్పారు. కిష్టగిరి ఒక్క గ్రామానికే సీఎం రిలీఫ్‌ఫండ్ నుంచి బాధితులకు రూ.8.51 లక్షలు ఇచ్చామన్నారు. రైతుబంధు కింద రూ.1.89 కోట్లు అందించామన్నారు. రైతుబీమా కింద నాలుగు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున చెల్లించామన్నారు. కేసీఆర్ కిట్ కింద 65 మంది లబ్ధి పొందారన్నారు. తమ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా మెలుగుతుందనడానికి ఇదే నిదర్శనమన్నారు. రూ.6 లక్షలతో త్వరలోనే అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. పట్టణ, గ్రామాల పరిశుభ్రతకు సర్కార్ పెద్దపీట వేసిందన్నారు.
గ్రామ పంచాయతీలకు ప్రతినెలా నిధులందిస్తున్న ఏకైక సర్కార్ తమదేనని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, ఎంపీపీ కిచ్చారెడ్డి, టీఆర్ఎస్ శిక్షణ కన్వీనర్ పురుషోత్తంరెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు మాణిక్యం, మాజీ సర్పంచ్ పద్మ, ఎంపీటీసీ ధర్మానాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, టీఆర్ఎస్ నాయకులు వెంకట్రావ్, రమేశ్‌గౌడ్, రఘువర్ధన్‌రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నర్సింహ, నారాయణ, టీక్యా, కృష్ణానాయక్, శేఖర్, మన్యం తిమ్మన్న, భగవంతు, వెంకటయ్యశెట్టి, రాము, జోయేబ్ తదితరులు పాల్గొన్నారు.