నవాబ్‌పేట, జూన్ 5 : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం లక్ష్మారెడ్డి అడుగుజాడల్లో పయనించిన.. టీఆర్ఎస్ నాయకుడు మెండె లక్ష్మయ్య మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే గిరిజన హ క్కుల సాధన కోసం పోరాటం చేసి.. వైస్‌చైర్మన్‌గా ఎంపికై న కొల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని సత్రోనిపల్లితండాకు చెందిన చందర్‌నాయక్ వైస్‌చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
చైర్మన్‌గా ఎన్నికైన మెండె లక్ష్మయ్య 20 10లో అప్ప టి ఉద్యమ నేత సీఎం కేసీఆర్ సమక్షలో టీ ఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి ల క్ష్మారెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉంటూ ప్ర త్యేక రాష్ట్ర సాధన కోసం ఉ ద్యమించారు. రాష్ట్ర సాధన అనంతరం నవాబ్‌పేట ఎం పీటీసీగా ఎన్నికయ్యారు. అ నంతరం పార్టీలో వివిధ హో దాల్లో పని చేశారు. అలాగే వైస్‌చైర్మన్‌గా ఎన్నికైన చందర్‌నాయక్ 2002 నుంచి గిరిజనుల హక్కుల సాధన కోసం పోరాడారు. తండాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించాలని ఉమ్మడి రాష్ట్ర సాధనలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.

ప్రత్యేక రాష్ట్రం ఏ ర్పాటైన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో కీలక నే తగా పని చేశారు. ప్రస్తుతం లక్ష్మారెడ్డి అనుగ్రహంతో వైస్‌చై ర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈనెల 6న నవాబ్‌పేట మార్కెట్ కమిటీ చైర్మన్‌గా మెండె లక్ష్మయ్య, వైస్‌చైర్మన్‌గా చందర్నాయక్తోపాటు మరో 12 మంది డైరెక్టర్లు పదవీ ప్రమాణ స్వీకరం చేయనున్నారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.