వనపర్తి, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత.. ఉద్యమ నాయకుడిగా పార్టీ వ్యవస్థాపకుడు కేసీఆర్ వనపర్తి జిల్లాలో కదన రంగానికి శ్రీకారం చుట్టారు. ప్రజలను చైతన్యవంతులు చే సేందుకు, యువతను మేల్కొలిపి ఉద్యమ సాధకులు గా మలిచేందుకు అప్పటి మహబూబ్‌నగర్ జిల్లా.., ప్ర స్తుత వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం చెలిమిల్లలో జూన్ 2001లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. టీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఎన్నికలైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా ఉద్యమ నేత కేసీఆర్ ప్రసంగించారు.
ప్రత్యేక రాష్ట్రంతోనే మన బతుకులు బాగుపడుతాయన్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలకులకు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యైలైన సన్నాసులు వత్తాసు పలుకడం వల్లే పక్కనే కృష్ణానది పారుతున్నప్పటికీ పాలమూరు ఎడారిగా మా రుతున్నదన్నారు. వలసల జిల్లాగా పేరుగాంచిందన్నారు. సారవంతమైన భూములు ఉన్న ఈ ప్రాంతం లో ప్రాజెక్టులు నిర్మించుకోవడంతోపాటు తెలంగాణ వాటాకు న్యాయబద్ధంగా వస్తే సాగునీటికి కొరత ఉండదన్నారు. ఈ పరిస్థితికి కాంగ్రెస్, టీడీపీ లే తోడుదొంగలుగా మారారన్నారు. కుట్ర పూరితం గా నీటి దోపిడీ జరుగుతున్నందువల్లే సాగునీరు లేక పా లమూరు వెలవెలబోతుందన్నారు. నిజాం హయాంలో నిర్మించిన రాజోలిబండ కట్టను బద్దలుకొట్టి రాయలసీమకు సాగునీటిని తరలిస్తూ పాలమూరు జిల్లాకు అన్యాయం చేశారన్నారు.
తుంగభద్ర ప్రాజెక్టు, ఆర్డీఎస్లను రాయలసీమ అవసరాలకు వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణను చేర్చడం ద్వారా జరిగిన నష్టానికి 17.84 టీఎంసీల నీటిని జూరాలకు కేటాయించినప్పటికీ.. అమలు చేయడంలో సీమాంధ్ర పాలకులు విఫలమయ్యారని విమర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు బచావత్ ట్రిబ్యూనల్ 15.90 టీఎంసీలను కేటాయించినా ఏనాడూ పాలమూరు జిల్లాకు ఏడు టీఎంసీల కంటే ఎక్కువ నీరందలేదన్నారు. ఎటు చూసినా ఎడారిగా కనబడుతున్న పాలమూరు పచ్చబడాలంటే ప్రత్యేక రాష్ట్రం అవసరమన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక పాలమూరు పచ్చబడింది. ఎటు చూసినా పచ్చదనం ఫరిడవిల్లుతున్నది. నాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ వెంట నేటి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఉన్నారు.