గద్వాల, జూన్ 1 : సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆర్డీఎస్ రైతులు సాగునీరు అందక తీ వ్రంగా నష్టపోతున్నా.. ఇక్కడి పాలకులు పట్టించుకోలేదు. నడిగడ్డ ప్రజలు, రైతులను ఎండబెట్టిన నే తల దగ్గరకు వెళ్లి ఈ ప్రాంత ప్రతిపక్ష ప్రజాప్రతినిధి హారతులు పట్టింది. ఆర్డీఎస్ కింద వాస్తవంగా 87, 500 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉన్నది. కానీ, గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఏనాడూ 35 వేల ఎకరాలకు మించి నీరు పారలేదు.
ఈ విషయాన్ని ఆనాడు నడిగడ్డ రైతులు టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. అది చూసి చలించిన కేసీఆర్ ఆర్డీఎస్ రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు జూన్ 10, 2004 లో అలంపూర్ నుంచి ఎనిమిది రోజులపాటు పాదయాత్ర చేశారు. సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటం తప్పదని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే నడిగడ్డ ప్రజల కోరిక నెరవేర్చుతానని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆర్డీఎస్ రైతుల చివరి ఆయకట్టు వరకు సాగునీరందిస్తామన్నారు. అవసరమైతే ఆర్డీఎస్ వద్ద కుర్చీ వేసుకొని కూర్చొని నడిగడ్డ రైతులను కాపాడుకుంటానన్నారు.
ప్రత్యేక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆర్డీఎస్ రైతుల కష్టాలు తీర్చాలని సంకల్పించారు. ఆర్డీఎస్ నుంచి మనకు వచ్చే నీటి వాటాను తీసుకుంటూనే.. రైతులకు ఎప్పుడూ రెండు పంటలకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని తుమ్మిళ్ల లిఫ్ట్‌ను ప్రారంభించారు. ఏడాదిలోపే తుమ్మిళ్ల లిఫ్ట్ పను లు పూర్తి చేసి ఆర్డీఎస్ రైతుల చివరి ఆయకట్టు వరకు సాగునీరందించారు. ఆనాడు పాదయాత్రలో రైతులకు ఇచ్చి న మాట నిలబెట్టుకున్నారు. ఇది నడిగడ్డ ప్రజలు ఎప్పటికీ మరచిపోలేని సంఘటనగా గుర్తుండి పోయింది.