నారాయణపేట టౌన్, మే 31 : ప్రతిఒక్కరూ పొగాకు వాడకాన్ని అరికట్టాలని డీఎంహెచ్వో డాక్టర్ రామ్మనోహర్రావు పిలుపునిచ్చారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక ది నం సందర్భంగా పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ధూమపానం చేయడం వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు కలుగుతాయని, క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయన్నారు. పొగాకును ఏ రూపం లో తీసుకున్న ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందన్నారు. పొగాకు వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రతి ఒక్కరికి అవగాహన క ల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డి ప్యూటీ డీఎంహెచ్వో శైలజ, మాస్ మీడియా అధికారి హనుమంతు, వైద్యులు రహమత్, రవీందర్ లఖావత్, ఏఎన్ఎంలు, ఆశ వర్క ర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
డిగ్రీ కళాశాలలో…
యువత పొగాకు వినియోగిస్తే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్ర భావం పడుతుందని చిట్టెం నర్సిరెడ్డి స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మెర్సీవసంత అన్నారు. ప్రపంచ పొ గాకు వ్యతిరేక దినం పురస్కరించుకొని ఎన్సీసీ, జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో కళాశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. దేశంలో 40శాతం టీబీ కేసులకు కారణం పొగాకు పీల్చడమేనన్నారు. ప్ర తిఒక్కరూ పొగాకు నియంత్రణకు కృషి చే యాలన్నారు. కార్యక్రమంలో ఎన్సీసీ అధికారి శంకర్, అధ్యాపకులు, ఎన్సీసీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి
మక్తల్ రూరల్, మే 31 : ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని టగ్ ఆఫ్ వార్ అసోసియేషన్ జిల్లా ప్ర ధానకార్యదర్శి గోపాలం కోరారు. ప్రపంచ పొగాకు వ్యతిరేఖ దినోత్సవం సందర్భంగా పట్టణంలో టగ్ ఆఫ్ వార్, మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవా రం విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్ర భుత్వ జూనియ ర్ కళాశాల మైదానం నుంచి పట్టణ పురవీధుల్లో దాదాపు 200 మంది విద్యార్థులు పొగాకు వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు తా న్సింగ్, ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, పీఈటీలు, విద్యార్థు లు తదితరులు పాల్గొన్నారు.