బాలానగర్, మే 27 : ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎంపీపీ కమల అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ పేదల సంక్షేమానికి ప్రభు త్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులందరికీ అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే గ్రామాల్లో సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. మండల సర్వసభ్య సమావేశానికి అధికారులు గైర్హాజరైతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో గిరిజన కార్పొరేషన్ చైర్మన్ వాల్యానాయక్, ఎంపీడీవో కృష్ణారావు, ఎంపీవో శ్రీదేవి, తాసిల్దార్ శ్రీనివాసులు, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు తిరుపతినాయక్, ప్రధానకార్యదర్శి శంకర్, సర్పంచులు రమేశ్‌నాయక్, రవినాయక్, మల్లేశ్‌యాదవ్, రమేశ్, రాజు, రాంరెడ్డి, మాల తి, శారద, ఎంపీటీసీ ప్రదీప్‌కుమార్‌గౌడ్, జమీర్‌పాషా, స్నేహలత, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.