గోపాల్పేట, మే 11 : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మండలంలోని ఆ యా గ్రామాల్లో ఉపాధి పనులు ఊపందుకున్నా యి. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కూ లీలు పనిముట్లతో ఉదయం 8గంటలలోపే పని ప్రదేశానికి చేరుకుంటున్నారు. ఎండ ముదురకముందే పనులు ముగించుకొని ఇండ్ల వద్దకు చే రుకుంటున్నారు. ప్రభుత్వం నిత్యం పని కల్పించడం, కూలీల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గో పాల్‌పేట మండలంలో 11,575 జాబ్‌కార్డులు ఉన్నాయి. ప్రస్తుతం 2,500మంది కూలీలు వి విధ రకాల పనులు చేస్తున్నారు. అన్ని గ్రా మాల్లో చెరువు పూడికతీత, ఫీడర్‌చానల్, గుట్టలపై కందకాలు తవ్వే పనులు కొనసాగుతున్నా యి. ఎప్పటికప్పుడు అధికారులు పని ప్రదేశానికి వెళ్లి పనుల పురోగతి పరిశీలించడంతోపాటు కూలీలకు కనీస వసతులు సమకూర్చుతున్నారు. ఎన్ఐసీ సాఫ్ట్‌వేర్‌లో పనులు, కూలీల సంఖ్య నమోదు చేస్తున్నారు. ఒక కూలీకి రోజు కు సగటున రూ.143వరకు వస్తుందని అధికారులు చెబుతున్నారు. 15రోజులకోసారి వారి ఖాతాలో కూలి డబ్బులు జమవుతున్నాయి. హ రితహారంలో మొక్కలు నాటేందుకు గుంతలు తీయడం, ఉద్యానవన పంటలైన మామిడి, జామ, సపోట, దానిమ్మ, బత్తాయి తదితర పం టలు రైతులు సాగు చేయాలనుకుంటే రైతుల పొలాల్లో ఉపాధి కూలీలు పనిచేసేందుకు అవకాశం ఉంది. ఉపాధిహామీ పథకం ద్వారా రైతులకు, కూలీలకు లబ్ధి చేకూరుతుంది. ప్రతి కూ లీకి పని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా అధికారులు ముందుకెళ్తున్నారు.
కూలీల శాతం పెరిగింది
ఉపాధిహామీ పథకంలో కూలీల శాతం పెరిగింది. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పనిచేసే ప్రదేశంలో నీడ కోసం టెంటు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాము. తాగునీటి కోసం కూలీకి రోజుకూ రూ.3నుంచి 5వరకు వారి ఖాతాలో జమవుతాయి. అనుకోకుండా ప్రమాదం జరిగితే ప్రథమ చికిత్స అందించేందుకు మెడికల్ కిట్ అందుబాటులో ఉంచాము. కూలీలు సమస్యలు వివరిస్తే మరిన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. – కరుణశ్రీ, ఎంపీడీవో, గోపాల్పేట
ఊరిలోనే ఉపాధి సంతోషం
ప్రతి కూలీకి ఊరిలోనే ప్రభుత్వం ఉపాధిపని చూపడం సంతోషంగా ఉంది. పనిచేసే చోట కూలీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో పొద్దునపోయి మధ్యాహ్నం వరకు ఇంటికి వస్తున్నాం. కూలి డబ్బులు ఒక్కోసారి ఆలస్యంగా ఖాతాలో పడుతున్నాయి. ఆలస్యం కాకుండా చూడాలి.
– యాపచెట్టు స్వామి, ఉపాధి కూలీ, గోపాల్పేట
నిత్యం పని దొరుకుతుంది
ఊరిలో కరువు పని నిత్యం దొరుకుతుంది. కరువు పనులు లేకుంటే కుటుంబం గడవడం ఇబ్బందిగా ఉండేది. ఎంత ఎండ ఉన్నా మందిలపోయి పని చేస్తుంటే అలుపు మరిచిపోతాము. తాగే నీళ్లు వెంట తీసుకెళ్తాము. కూలీతోపాటు నీళ్ల కోసం సర్కారోళ్లు ఖాతాలో పైసలు ఏస్తరు. కరువు పనులు లేకుంటే కష్టం. నిత్యం పని దొరుకుతున్నందుకు చానా సంతోషంగా ఉన్నది. చీకూచింత లేకుండా బతుకుతున్నాం.
– చంద్రమ్మ, ఉపాధి కూలీ, ఏదుట్ల