జడ్చర్లటౌన్, మే 10 : ప్రతిఒక్కరూ పర్యావరణాన్ని కాపాడుకోవాలని పలువురు వక్తలు కోరారు. జడ్చర్లలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వృక్షశాస్త్ర విభాగం, జీవవైవిధ్య అభివృద్ధ్ది సమా ఖ్య ఆధ్వర్యంలో పర్యావరణ సుస్థిరత, జీవవైవిధ్య పరిరక్షణ సమగ్ర విధానాలపై మంగళవారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అప్పీయ చిన్నమ్మ అధ్యక్షతన జాతీయ సద స్సు నిర్వహించారు. సదస్సులో శ్రీకృష్ణ దేవరాయ యూ నివర్సిటీ విశ్రాంత ఆచార్యులు టీ పుల్లయ్య, ఇస్రో శాస్త్రవేత్త సుధాకర్‌రెడ్డి, ఫారెస్ట్ కళాశాల అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్ ఎం మమత, యోగివేమన యూనివర్సిటీ ఆచార్యులు డాక్టర్ కేవీ ప్రసాద్ తూర్పు కనుమలలోని వృక్షసంపద, పురాతన వన్యజాతులు, వాటి సంరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం ‘పర్యావరణ వృక్ష సంపద’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ వెస్లీ కళాశాల, కర్నూల్, మహబూబ్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఆన్లైన్ ద్వారా వీక్షించారు. కార్యక్రమంలో వైస్‌ప్రిన్సిపాల్ రవీందర్రావు, అధ్యాపకులు పీ శ్రీనివాసులు, డాక్టర్ సదాశివయ్య, నిర్మలాబాబురావు, లత, సిద్దులు, శ్రీనివాసరావు, నీరజ పాల్గొన్నారు.