మహబూబ్‌నగర్, మే 8 : సగర జాతి పట్టుదలకు మారుపేరుగా ఉంటుందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. సగర వంశస్తుడు భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకొని ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సగర కాలనీలోని కమ్యూనిటీ భవనంలో అధికారికంగా నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మనిషికి నాగరికతను నేర్పిన జాతి సగర జాతి అన్నారు. ముఖ్యంగా భగీరథ మహర్షి తన తపస్సుతో దివి నుంచి భువికి గంగను తీసుకొచ్చారని గుర్తు చేశారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటింటికీ తాగునీరిచ్చే పథకానికి మిషన్ భగీరథగా పేరు పెట్టిందన్నారు.
తెలంగాణ ఏర్పడ్డాక అన్ని జిల్లాల్లో అధికారికంగా భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తరపున సగరులకు అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో సగర భవన నిర్మాణానికి స్థలంతోపాటు నిధులు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధి పరుగులు తీస్తుంటే ప్రతిపక్ష నేతలకు మాత్రం కనిపించడం లేదని ధ్వజమెత్తారు. అందుకే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
పనిచేసే ప్రభుత్వానికే ప్రజల మద్దతు ఉంటుందన్నారు. రాజకీయ పబ్బం కోసం మాట్లాడే పార్టీలకు గుణపాఠం తప్పదని మంత్రి హెచ్చరించారు. కార్యక్రమంలో సగర సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్చంద్ర, డీపీఆర్వో వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ రెహ్మాన్, జెడ్పీటీసీ ఇంద్ర, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, బీసీ సంక్షేమ శాఖాధికారి ఇందిర, సగర సంఘం నాయకులు బుడ్డన్న, ఆంజనేయులు, ప్రేమ్‌సాగర్, రవి, హనుమంతు, గడ్డమీది కృష్ణ, ప్రేమ్‌సాగర్, శ్రీధర్, చిన్న, కిష్టయ్య, భీమన్న, పల్లె చందర్, నారాయణ, అలివేలు తదితరులు పాల్గొన్నారు.
అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
హన్వాడ, మే 8 : రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలో రైతువేదిక, సీసీ రోడ్లతోపాటు పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అలాగే మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా రూ.40 లక్షల 20 వేలతో మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా ఉండాలన్నారు.
గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి చేశానని గుర్తు చేశారు. రైతుల కోసం ప్రాజెక్టులు, రైతుబీమా, పంట పెట్టుబడి, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ వంటి పథకాలు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి పథకాలు ప్రపంచంలోనే ఎక్కడా అమలు కావడం లేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుంటే జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో అన్ని చెరువులను నింపి ప్రతి ఎకరాకూ సాగునీరు అందించడమే లక్ష్యమన్నారు. సమైక్య పాలనలో తెలంగాణ అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిందన్నారు.
అధికారులపై ఆగ్రహం
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా నూతన భవనం నిర్మాణం కోసం నిధులు మంజూరైతే శిలాఫలకం పాఠశాలలో ఏర్పాటు చేయడంపై అధికారులు, ప్రజాప్రతినిధులపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని నిధులు మంజూరు చేస్తే ఎక్కడ శిలాఫలకం ఏర్పాటు చేయాలో తెలియదా..? చూసుకునే బాధ్యత అధికారులకు లేదా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బాల్‌రాజ్, జెడ్పీటీసీ విజయ నిర్మల, పార్టీ అధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రాజుయాదవ్, సింగిల్ విండో చైర్మన్ వెంకటయ్య, వైస్ చైర్మన్ కృష్ణయ్యగౌడ్, ఎంపీడీవో ధనుంజయగౌడ్, తాసిల్దార్ శ్రీనివాసులు, ఏపీఎం సుదర్శన్, ఏవో కిరణ్‌కుమార్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.