నారాయణపేట, మే 7 : మున్సిపాలిటీ పరిధిలో రూ. 81కోట్ల94లక్షల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులకు శం కుస్థాపనలు, ప్రారంభోత్సవాలను చేపట్టనున్నారు. ఈనెల 9న జరుగనున్న కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి కే టీఆర్ హాజరు కానున్నారు. ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశా రు. సోమవారం చేపట్టనున్న కార్యక్రమాలకు తోడు, సభా వేదిక ప్రాంతాన్ని కలెక్టర్ హరిచందన, ఎస్పీ వెంకటేశ్వర్లు తో కలిసి ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్‌రెడ్డి పర్యవేక్షించారు. సభకు హాజరయ్యే ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టాలని నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు. హైదరాబాద్ నుంచి రో డ్డు మార్గాన రానున్న మంత్రి కేటీఆర్ ఉదయం 11 గంటలకు పేటకు చేరుకొ ని ముందుగా మిషన్ భగీరథ పథకం తో రూ.29.09కోట్ల వ్యయంతో చేపట్టిన ట్యాంకులు, పైప్లైన్లకు సంబంధించి సింగారం చౌరస్తా స మీపంలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం పక్కన గల సంప్ హౌస్ వద్ద పైప్‌లైన్ పనులను ప్రారంభించనున్నారు.
రూ.కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన సబ్ స్టేషన్ ను ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి 6వ వార్డు బీసీ కాలనీ సమీపంలో లే అవుట్ నంబర్ 81/95లో ఓపెన్ ప్లేస్‌లో రూ.కోటి 20లక్షల వ్యయంతో చేపట్టనున్న పార్కు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అక్కడే 13 ఎకరా ల్లో రూ. 6కోట్ల 65లక్షల వ్యయంతో చేపట్టనున్న స్టే డియం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అక్కడే రూ.20కోట్ల వ్య యంతో చేపట్టనున్న గోల్డ్ సోక్ మార్కెట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. అక్కడి నుంచి ఎర్రగు ట్ట వద్ద రూ.2కోట్ల వ్యయంతో చేపట్టనున్న జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన, ఆ పక్కనే రూ.కోటి వ్య యంతో చేపట్టనున్న మాడరైజేషన్ ఆఫ్ ధో బీఘాట్కు శంకుస్థాపన చేయనున్నారు.
అ క్కడి నుంచి చిల్డ్రన్ దవాఖానకు ఆనుకొని ఉన్న సర్వే నం బర్ 108, 109, 110లో ఖాళీ స్థలంలో రూ.కోటి వ్యయంతో చేపట్టనున్న మున్సిప ల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆ పక్కనే రూ.కోటి 35లక్షల వ్యయం తో చేపట్టనున్న చికెన్, చేపల మార్కెట్‌ను ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి బయలుదేరి పేట మున్సిపాలిటీ పరిధిలో రూ.12 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణా కి సంబంధించి 15వ వార్డులో ఏర్పాటు చేసి న శిలాఫలాకాన్ని ప్రారంభించనున్నారు.
అక్కడి నుంచి బయలుదేరి దామరగిద్ద మార్గంలో కొం డారెడ్డిపల్లి చెరువు వద్దకు చేరుకొని రూ.4కోట్ల వ్యయంతో చేపట్టనున్న మినీ ట్యాంక్ బండ్ పనులకు శంకుస్థాపన చే సి, అక్కడి నుంచి పేరపళ్ల మార్గంలో శివాలయం సమీపం లో రూ.కోటి10లక్షల వ్యయంతో చేపట్టనున్న వృద్ధాశ్రమానికి శంకుస్థాపన చేసి, రూ.87లక్షల45 వేల వ్యయంతో చే పట్టనున్న చిల్డ్రన్ పార్కుకు శంకుస్థాపన చేయనున్నారు. భో జన విరామం తర్వాత 3 గంటలకు స్థానిక మినీ స్టేడియం లో జరిగే ప్రజా కృతజ్ఞత సభకు హాజరై నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.