మహబూబ్‌నగర్, మే 5 : జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్‌బండ్‌లో పూడికతీత పనులను వేగవంతం చే యాలని కలెక్టర్ వెంకట్రా వు అన్నారు. ఇటీవల మం త్రి శ్రీనివాస్‌గౌడ్ ట్యాంక్‌బండ్ సందర్శన సందర్భంగా చేసిన సూచనలపై గురువారం వివిధ శాఖల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నెక్లెస్‌రోడ్డు, సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా ట్యాంక్బాండ్లో నీటి తోడివేత, పూడికతీత, గుర్రపు డెక్క తొలగింపు పనుల్లో వేగం పెంచాలన్నారు. నీటి తోడివేతకు అవసరమైతే ఎక్కువ కెపాసిటి మోటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ట్యాంక్‌బండ్ చుట్టూ పదిమీటర్ల మేర వాకింగ్‌ట్రాక్ ఏర్పాటు కోసం పనులను చేపట్టాలన్నారు. బండ్ విస్తరణకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు నిర్ధారించాలని తాసిల్దార్‌ను ఆదేశించారు. అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ నిర్ధారణలో తాసిల్దార్‌తోపాటు, టౌన్‌ప్లానిం గ్ అధికారులు చురుకైన పాత్ర పోషించాలని తెలిపారు. వీసీలో వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
నేడు ప్రత్యేక ప్రజావాణి
దళితుల సమస్యల పరిష్కారానికి శుక్రవారం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెంకట్రావు ప్రకటనలో తెలిపారు. ఉదయం 11నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకు రెవెన్యూ సమావేశమందిరంలో ప్రజావాణి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే 12వ తేదీన ఉదయం 11నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ది వ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజావాణిలో తనతోపాటు అదనపు కలెక్టర్లు, అన్నిశాఖల జిల్లాస్థాయి, మండలస్థాయి అధికారులు హాజరువుతారన్నారు. ప్ర జావాణిని దళితులు, దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.