దేవరకద్ర రూరల్/బాలానగర్, మే 5 : మనఊరు-మనబడి కార్యక్రమానికి ఎంపికైన పాఠశాలల్లో అన్ని వసతులను కల్పించాలని అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు అన్నారు. దేవరకద్ర మండలకేంద్రంలోని బాలుర పాఠశాల, కోయిల్‌సాగర్, నాగారం, చిన్నచింతకుంట మండలంలోని పర్దీపూర్ పాఠశాలలను గురువారం తేజస్ నందలాల్, బాలానగర్ మండలకేంద్రంలోని బాలికల జెడ్పీహెచ్ఎస్, గౌతాపూర్ పాఠశాలలను సీతారామారావు పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడారు. మనఊరు-మనబడి కార్యక్రమానికి ఎంపికైన పాఠశాలల్లో కల్పించాల్సిన వసతులపై ఉపాధ్యాయులతో చర్చించి నిధుల మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అ ధికారులకు సూచించారు. ఈ ఏడాది నుం చి ఇంగ్లిష్ మీడియం ప్రారంభంకానున్న సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ను పెంచాలని ఆదేశించారు.
అలాగే దేవరకద్ర మండలంలోని నాగారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ సందర్శించి రైతులతో మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కేం ద్రం నిర్వాహకులకు సూచించారు. కా ర్యక్రమంలో సీసీకుంట ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, సర్పంచ్ సుప్రియ, తాసిల్దార్ సువర్ణరాజు, ఎంపీడీవోలు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాసులు, ఆర్ఐ సురేశ్, ఏఈ కురుమూర్తి, క్లస్టర్ హె చ్ఎం చంద్రకళ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోట రాము, శ్రీకాంత్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.