జడ్చర్ల, మే 5 : మండలంలోని పెద్ద ఆదిరాల, పోలేపల్లి, కోడ్గల్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం పలువురు ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. బాదేపల్లి పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వైస్‌చైర్మన్ సుధాకర్‌రెడ్డి తెలిపారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, సర్పంచ్ కృష్ణాబాయి, పీఏసీసీఎస్ డైరెక్టర్లు నర్సింహారెడ్డి, రామకృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆంజనేయులు, వెంకటేశ్, ముడా డైరెక్టర్ ఇమ్మూ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, రమేశ్‌జీ, తిరుపతిరెడ్డి, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ జంగయ్య, నవీన్‌రెడ్డి, మల్లికార్జున్, రామలింగారెడ్డి, అశోక్‌గౌడ్, రాము, శివకుమార్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన ధాన్యం తీసుకురావాలి
కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలని జిల్లా కోఆపరేటీవ్ అధికారి సుధాకర్ రైతులకు సూచించారు. మండలంలోని పాతమొల్గర, కొత్తమొల్గర, గోప్లాపూర్ గ్రామాల్లో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యంలో 17శాతంలోపు తేమ ఉండాలని తెలిపారు. అలాగే తాలు, మ ట్టిపెడ్డలు లేకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీనివాస్‌రెడ్డి, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ సత్యనారాయణ, సీఈవో రత్నయ్య పాల్గొన్నారు.